UPSC Jobs : నెలకు రెండు లక్షల జీతంతో గవర్నమెంట్ జాబ్స్… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

UPSC Jobs : నెలకు రెండు లక్షల జీతంతో గవర్నమెంట్ జాబ్స్… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం…!

UPSC Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త.. యూనిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC )తాజాగా నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ సంస్థ సివిల్స్, ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేయగా వివిధ విభాగాలలో ముఖ్యమైన పోస్టులను భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక దీనిలో ఈసారి అసిస్టెంట్ డైరెక్టర్ , సైంటిస్ట్ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ , స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టును భర్తీ చేసేందుకు ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  UPSC Jobs : నెలకు రెండు లక్షల జీతంతో గవర్నమెంట్ జాబ్స్... ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం...!

UPSC Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త.. యూనిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC )తాజాగా నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ సంస్థ సివిల్స్, ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేయగా వివిధ విభాగాలలో ముఖ్యమైన పోస్టులను భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక దీనిలో ఈసారి అసిస్టెంట్ డైరెక్టర్ , సైంటిస్ట్ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ , స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టును భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

UPSC Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) నుండి విడుదల కావడం జరిగింది.

ఖాళీలు : ఈ రిక్రూట్మెంట్ మొత్తం 67 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక దీనిలో అసిస్టెంట్ డైరెక్టర్ – 51 పోస్టులు , సైంటిస్ట్ – బీ – 1 పోస్ట్ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 – 2 పోస్టులు , సైంటిస్ట్ బీ- 9 పోస్టులు , స్పెషలిస్ట్ గ్రేడ్ – 3 పోస్టులు భర్తీ కానున్నాయి.

వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు పోస్టుల ఆధారంగా వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

విద్యార్హత : అసిస్టెంట్ డైరెక్టర్ – ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ / ఏరోనాటికల్/ ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

సైంటిస్ట్ బి – ఈ పోస్టుకు అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 – ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

సైంటిస్ట్ బీ – ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి జువాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

స్పెషలిస్ట్ గ్రేడ్ 3 – ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్ ఫీజ్: ఈ ఉద్యోగానికి జనరల్ మరియు ఓబిసి ( OBC ) క్యాటగిరి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి. SC ,ST మరియు మహిళలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

ఎంపిక విధానం.: ముందుగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు న్యూఢిల్లీ/ ముంబై /చెన్నై/ కోల్కతా/ బెంగళూరు /హైదరాబాద్ /అహ్మదాబాద్/ డెహ్రాడూన్ /లక్నో/ భూపాల్/ నాగపూర్/ పాట్నా / గౌహతి/ జైపూర్ వంటి నగరాల్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

జీతం : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 – రూ.56,000 – రూ.1,77,500

స్పెషలిస్ట్ గ్రేడ్ – రూ.67,000 – రూ.2,08,700

అసిస్టెంట్ డైరెక్టర్ – వీరి జీతం పే లెవెల్-11 ఆధారంగా ఉంటుంది.

సైంటిస్ట్ బీ – పే లెవెల్ – 10 ప్రకారం ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది