Postal Jobs : ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఖాళీలు.. తెలుగు రాష్ట్రాల పోస్టుల వివరాలివే…
Postal Jobs : ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగం పురుష లక్షణం అని ఒకప్పటి సామెత. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగం మానవ లక్షణం అనేలా పరిస్థితులు తయారయ్యాయి. కావున నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం వెంపర్లాడుతున్నారు. ప్రైవేట్ జాబ్ కన్నా గవర్నమెంట్ జాబ్ అయితే చాలా బెటర్ గా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చూస్తున్నారు. అటువంటి వారు ప్రభుత్వం తరఫున ఎటువంటి సంస్థలో ఉద్యోగాలు భర్తీ అయినా కానీ అప్లై చేస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కసితో చదువుతున్నారు. అటువంటి అభ్యర్థుల కోసం ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఒక తీపి కబురును అందించింది.
పేమెంట్స్ బ్యాంకులో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు కావాల్సిన అర్హతలేంటో ఓ సారి తెలుసుకుంటే…ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థ. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఇది ఉంటుంది. కావున ఈ ఉద్యోగాలు సంపాదించేందుకు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా 650 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను మంజూరు చేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 21, ఏపీలో 34 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అర్హతలు…
Postal Jobs : తెలుగు రాష్ట్రాల్లోనూ కొలువుల పండుగ..
- ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు గ్రాడ్యుయేషన్ తో పాటు గ్రామీణ డాక్ సేవక్ గా రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
- 30 ఏప్రిల్ 2022 నాటికి అభ్యర్థి వయసు 20 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
అభ్యర్థులు రూ. 700 ను పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.