Kondapolam Movie Traile : ఆసక్తికరంగా ‘కొండపొలం’ ట్రైలర్.. ఈ సారీ హిట్ గ్యారంటీ..!
‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కొండ పొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను క్రిష్ తెరకెక్కించారు.
అక్టోబర్ 8న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో అడవి ప్రాంతానికి చెందిన యువకుడు రవీంద్రయాదవ్‌గా వైష్ణవ్ తేజ్, గిరిజన యువతి ఓబులమ్మగా రకుల్ కనిపించనున్నారు. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

ట్రైలర్‌లో కనిపించే పులితో ఫైట్ సీన్, రకుల్‌తో ప్రేమ అంశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనిపిస్తోంది. ‘భయమెస్తే ఓబు ఓబు’ అనుకుంటానులే అని పంజా వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇకపోతే తొలి సినిమాతోనే హిట్ అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఈ సారి కూడా ఈ సినిమాతో డెఫినెట్‌గా సూపర్ హిట్ అందుకుంటారని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Advertisement
WhatsApp Group
Join Now