Vastu Tips | గణేష్ చతుర్థి ప్రత్యేకం..వాస్తు ప్రకారం వినాయక విగ్రహాన్ని ఎలా, ఎక్కడ ప్రతిష్టించాలి?
Vastu Tips | గణేష్ చతుర్థి రోజు సమీపిస్తుండటంతో హిందూ భక్తుల్లో పండుగ ఉత్సాహం నెలకొంది. 2025 ఆగస్టు 27న ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని జరుపుకోనున్నారు. వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మండపాల్లో, ఇళ్లలో విభిన్న శైలి గణేశ విగ్రహాలు ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అనంతరం నిమజ్జనం చేస్తారు.
#image_title
ఈ నియమాలు పాటించాలి..
ఈ సందర్భంలో వాస్తు శాస్త్రం ప్రకారం గణపతిని ఎక్కడ, ఎలాంటి రూపంలో పూజించాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈశాన్య దిశ (ఉత్తర-తూర్పు)లో గణేశుడి విగ్రహాన్ని ఉంచడం అత్యంత శుభకరం.దీ ని వల్ల ఆర్థికంగా అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ, సానుకూల శక్తుల వృద్ధి జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
తూర్పుదిశ కూడా శుభదిశే.అయితే పశ్చిమం లేదా దక్షిణ దిశల్లో విగ్రహం ఉంచడం అనుకూలం కాదు. అలా చేస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. గణేశుడి ఎడమవైపు తొండం ఉన్న విగ్రహాలే ఎక్కువగా పూజకు అనుకూలం.ఇది శాంతి, శ్రేయస్సును అందిస్తుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. గణేశ్ విగ్రహాన్ని తప్పనిసరిగా ఇంటి పూజగదిలో ఉంచాలి. అలా ఉంచినప్పుడు పాజిటివ్ ఎనర్జీ, వైబ్రేషన్లు ఇంటి నిండుస్తాయని నిపుణుల అభిప్రాయం. గణేశుడితో పాటు లక్ష్మీ దేవి విగ్రహంను కూడా పూజగదిలో ఉంచితే సంపద, శ్రేయస్సు మరింత పెరుగుతుందని నమ్మకం.