Vijay Devarakonda : విజయ్ దేవరకొండ.. రష్మిక అందుకే కలిసి నటించట్లేదా.. చాలా పెద్ద స్కెచ్చే..!
ప్రధానాంశాలు:
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ.. రష్మిక అందుకే కలిసి నటించట్లేదా.. చాలా పెద్ద స్కెచ్చే..!
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి ఎప్పుడు చేస్తారా అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. ఐతే ఈ ఇద్దరు కలిసి నటించకపోవడానికి వెనక రీజన్ వేరే ఉందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ కింగ్ డమ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా లో ముందు రష్మికని అనుకున్నారట కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాలేదని భాగ్య శ్రీతో కానిస్తున్నారు. నెక్స్ట్ విజయ్ దేవరకొండ చేస్తున్న రెండు సినిమాల్లో కూడా రష్మిక నటించే ఛాన్స్ లేదని టాక్. ఐతే విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పటికే గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ చేశారు. ఐతే ఈ ఇద్దరు కలిసి 3 వ సినిమా చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఐతే వీరిద్దరు మరోసారి కలిసి చేసే సినిమా వేరే లెవెల్ లో ఉండాలని కోరుతున్నారు. అంతేకాదు విజయ్, రష్మికల మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది అన్నట్టుగా మీడియా కథనాలు ఉన్నాయి. ఐతే కలిసి నటిస్తే మళ్లీ అది బయటపడే ఛాన్స్ ఉంది.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ.. రష్మిక అందుకే కలిసి నటించట్లేదా.. చాలా పెద్ద స్కెచ్చే..!
Vijay Devarakonda : వాళ్ల వాళ్ల సినిమాలతో బిజీగా..
అందుకే ఇద్దరు వాళ్ల వాళ్ల సినిమాలతో బిజీగా ఉన్నారట. ఐతే ఏదైనా కథ ఇది కచ్చితంగా కలిసి చేయాల్సిందే అన్నది అనిపిస్తే మాత్రం రష్మికని తీసుకోవాలని అనుకుంటున్నాడట విజయ్ దేవరకొండ. అతను సినిమా చేయమంటే రష్మిక నో చెప్పే ఛాన్స్ లేదు. తన కోసం వేరే సినిమా ఏదైనా వదిలేసే అవకాశం ఉంది. కానీ విజయ్, రష్మిక కాంబో మీద ఆడియన్స్ లో ఉన్న అంచనాలకు తగినట్టుగా సినిమా చేయాలని ఇన్నాళ్లు కలిసి చేయలేదని తెలుస్తుంది.
అంతేకాదు రష్మిక మరోపక్క బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందుకే ఆమె కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక కూడా విజయ్ వేరే హీరోయిన్స్ తో చేస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా విజయ్, రష్మిక కలిసి మరోసారి సిల్వర్ స్క్రీన్ పై అలరించాలని వారి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అది ఎప్పటికి కుదురుతుందో చూడాలి. విజయ్ కింగ్ డమ్ మే ఎండింగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే. Vijay Devarakonda, Rashmika Mandanna, Geetha Govindam, Kingdom, Tollywood