Numbness : చేతులకు తిమ్మిర్లు వస్తున్నాయా? మీకు ఈ సమస్య ఉన్నట్టే.. వీటిని తింటే తిమ్మిర్లు వెంటనే తగ్గుతాయి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Numbness : చేతులకు తిమ్మిర్లు వస్తున్నాయా? మీకు ఈ సమస్య ఉన్నట్టే.. వీటిని తింటే తిమ్మిర్లు వెంటనే తగ్గుతాయి..!

Numbness : చాలామందికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది. కొందరికైతే చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి. చాలా సేపు దాకా తిమ్మిర్లు అస్సలు పోవు. కాళ్లకు కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. దానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు కానీ.. తిమ్మిర్లు రావడం వల్ల.. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కాసేపు చేతులు, కాళ్లు పని చేయకపోవడం.. ఎంత కదిపినా కదపక పోవడం లాంటిది జరగడంతో ఏం చేయాలో పాలుపోదు. అయితే.. ఇది చాలామందిలో ఉండేదే కాబట్టి.. పెద్దగా తిమ్మిర్లను పట్టించుకోరు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 June 2021,12:45 pm

Numbness : చాలామందికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది. కొందరికైతే చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి. చాలా సేపు దాకా తిమ్మిర్లు అస్సలు పోవు. కాళ్లకు కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. దానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు కానీ.. తిమ్మిర్లు రావడం వల్ల.. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కాసేపు చేతులు, కాళ్లు పని చేయకపోవడం.. ఎంత కదిపినా కదపక పోవడం లాంటిది జరగడంతో ఏం చేయాలో పాలుపోదు. అయితే.. ఇది చాలామందిలో ఉండేదే కాబట్టి.. పెద్దగా తిమ్మిర్లను పట్టించుకోరు. ఏదో కాసేపు వచ్చి పోతాయి కదా.. అని అనుకుంటారు కానీ.. తిమ్మిర్లు మనకు ఏం సంకేతాలు ఇస్తున్నాయి.. అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోము.

vitamin b12 deficiency numbness

vitamin b12 deficiency numbness

అయితే.. చేతులకు, కాళ్లకు వచ్చే తిమ్మిర్లకు కారణం ఏంటో తెలుసా? శరీరంలో కావాల్సినంత విటమిన్లు లేకపోవడమే. విటమిన్లు అనగానే చాలామందికి గుర్తొచ్చేది విటమిన్ సీ, డీ, ఈ, కే. కానీ.. మన శరీరానికి ఇంకో ముఖ్యమైన విటమిన్ కూడా ఎంతో అవసరం. అదే విటమిన్ బీ 12. ఇది శరీరానికి ప్రతి రోజు అవసరం. ఇది లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందులో ఒకటి ఈ తిమ్మిర్లు. దీన్నే చాలామంది బీ 12 డిఫిషియెన్సీ అంటారు.

Numbness : విటమిన్ బీ 12 కావాలంటే ఏం తినాలి?

మీకు తెలుసో తెలియదో.. విటమిన్ బీ 12 శరీరంలో సరైనంత లేకపోవడం వల్ల.. తిమ్మిర్లతో పాటు చాలా ఆరోగ్య సమస్యలు వస్యి. మన భారతదేశంలో విటమిన్ బీ 12 డెఫిషియెన్సీతో సుమారు 74 శాతం మంది బాధపడుతున్నారట. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా.. నరాల బలంగా తయారవ్వాలన్నా.. ఎర్రకక్తకణాలు వృద్ధి చెందాలన్నా.. బీ 12 ఖచ్చితంగా అవసరం. శరీరంలో మెటబాలిజం రేటు పెరగాలన్నా ఈ విటమిన్ కావాల్సిందే. డిప్రెషన్, గుండె జబ్బులు, స్కిన్ సమస్యలు, కాగ్నిటివ్ సమస్యలకు చెక్ పెట్టాలన్నా విటమిన్ బీ 12 శరీరానికి సరిపడినంత కావాల్సిందే.

vitamin b12 deficiency numbness

vitamin b12 deficiency numbness

అందుకే.. ప్రతి రోజు మనం తినే ఆహారంలో విటమిన్ బీ 12 ఉండే ఆహారాన్ని కూడా ఖచ్చితంగా తినాలి. అయితే.. విటమిన్ బీ 12 ఎందులో ఉంటాయంటే? పాలు, పాలకు సంబంధించిన ఇతర పదార్థాలు, చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ లలో కావాల్సినంత విటమిన్ బీ 12 ఉంటుంది. ఈ విటమిన్ ను కావాలంటే.. ఖచ్చితంగా ఈ ఫుడ్ ను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిందే. విటమిన్ బీ 12 సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి కానీ.. ఫుడ్ సప్లిమెంట్స్ అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మిగితా సమయాల్లో తీసుకోకూడదు. ఈ విటమిన్ కోసం ఫుడ్ నే ఎక్కువగా తీసుకుంటే బెటర్. తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. విటమిన్ బీ 12 డెఫిషియెన్సీ వల్ల వచ్చే ఎన్నో సమస్యలు తగ్గుతాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Diabetes : షుగర్ వచ్చిన వాళ్లు గ్రీన్ తాగొచ్చా? తాగితే ఏమౌతుంది?

ఇది కూడా చ‌ద‌వండి ==> Dengue : డెంగ్యూ జ్వరం ఎలా వ‌స్తుంది.. రాక‌ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు సంతానం క‌ల‌గ‌డం లేదా.. అయితే రోజూ బీట్ రూట్ క‌చ్చితంగా తినండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Lungs : ఊపిరితిత్తుల సమస్యకు చెక్ పెట్టాలా? ఈ పని చేయండి.. శ్వాస సమస్యలు కూడా దూరమవుతాయి?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది