Diabetes : షుగర్ వచ్చిన వాళ్లు గ్రీన్ తాగొచ్చా? తాగితే ఏమౌతుంది?
Diabetes : డయాబెటిస్.. లేదా షుగర్.. పేరు ఏదైనా, ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచాన్నే భయపెడుతోంది. దాని వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ప్రతి పది మందిలో ఐదారుగురికి షుగర్ వస్తోంది. అందుకే.. షుగర్ వ్యాధి అంటేనే అందరూ భయపడుతున్నారు. షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు.. జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. అది తినాలి.. ఇది తినొద్దు.. అంటూ గిరి గీసుకొని కూర్చోవాల్సి ఉంటుంది. ఏది తినాలన్నా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.
చాలామంది ఆరోగ్యం కోసం గ్రీన్ టీను తాగుతుంటారు. గ్రీన్ టీ వల్ల.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీని తాగడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్టరాల్ ను కూడా గ్రీన్ టీ తగ్గిస్తుంది. అలాగే.. బరువు తగ్గాలని అనుకునే వాళ్లు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. అలాగే.. గ్రీన్ టీని నిత్యం తీసుకోవడం వల్ల.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాని వల్ల.. డయాబెటిస్ టైప్ 2 రిస్క్ ను తగ్గిస్తుందట. అందుకే.. షుగర్ ఉన్నవాళ్లు గ్రీన్ టీని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
Diabetes : గ్రీన్ టీని ఎలా తయారు చేయాలి?
మరి.. షుగర్ పేషెంట్లకు ఎంతో ఉపయోగకరమైన గ్రీన్ టీని ఎలా తయారు చేయాలో తెలుసా? కాసిన్ని నీటిని మరిగించి.. గ్రీన్ టీ ఆకులను వేయాలి. ఇంకాసేపు మరిగాక.. దాన్ని వడబోసి కప్ లో పోసి.. ఇంత తేనె కానీ.. నిమ్మరసం కానీ కలుపుకొని తాగేయడమే. అయితే.. గ్రీన్ టీని నిత్యం తీసుకోవచ్చు కానీ.. ఎక్కువగా తీసుకోకూడదు. పరిమితంగా అంటే రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగితే చాలు. షుగర్ ను కంట్రోల్ చేసుకోవడంతో పాటు.. పలు రకాల సమస్యలను కూడా జయించవచ్చు.