Numbness : చాలామందికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది. కొందరికైతే చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి. చాలా సేపు దాకా తిమ్మిర్లు అస్సలు పోవు. కాళ్లకు కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. దానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు కానీ.. తిమ్మిర్లు రావడం వల్ల.. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కాసేపు చేతులు, కాళ్లు పని చేయకపోవడం.. ఎంత కదిపినా కదపక పోవడం లాంటిది జరగడంతో ఏం చేయాలో పాలుపోదు. అయితే.. ఇది చాలామందిలో ఉండేదే కాబట్టి.. పెద్దగా తిమ్మిర్లను పట్టించుకోరు. ఏదో కాసేపు వచ్చి పోతాయి కదా.. అని అనుకుంటారు కానీ.. తిమ్మిర్లు మనకు ఏం సంకేతాలు ఇస్తున్నాయి.. అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోము.
అయితే.. చేతులకు, కాళ్లకు వచ్చే తిమ్మిర్లకు కారణం ఏంటో తెలుసా? శరీరంలో కావాల్సినంత విటమిన్లు లేకపోవడమే. విటమిన్లు అనగానే చాలామందికి గుర్తొచ్చేది విటమిన్ సీ, డీ, ఈ, కే. కానీ.. మన శరీరానికి ఇంకో ముఖ్యమైన విటమిన్ కూడా ఎంతో అవసరం. అదే విటమిన్ బీ 12. ఇది శరీరానికి ప్రతి రోజు అవసరం. ఇది లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందులో ఒకటి ఈ తిమ్మిర్లు. దీన్నే చాలామంది బీ 12 డిఫిషియెన్సీ అంటారు.
మీకు తెలుసో తెలియదో.. విటమిన్ బీ 12 శరీరంలో సరైనంత లేకపోవడం వల్ల.. తిమ్మిర్లతో పాటు చాలా ఆరోగ్య సమస్యలు వస్యి. మన భారతదేశంలో విటమిన్ బీ 12 డెఫిషియెన్సీతో సుమారు 74 శాతం మంది బాధపడుతున్నారట. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా.. నరాల బలంగా తయారవ్వాలన్నా.. ఎర్రకక్తకణాలు వృద్ధి చెందాలన్నా.. బీ 12 ఖచ్చితంగా అవసరం. శరీరంలో మెటబాలిజం రేటు పెరగాలన్నా ఈ విటమిన్ కావాల్సిందే. డిప్రెషన్, గుండె జబ్బులు, స్కిన్ సమస్యలు, కాగ్నిటివ్ సమస్యలకు చెక్ పెట్టాలన్నా విటమిన్ బీ 12 శరీరానికి సరిపడినంత కావాల్సిందే.
అందుకే.. ప్రతి రోజు మనం తినే ఆహారంలో విటమిన్ బీ 12 ఉండే ఆహారాన్ని కూడా ఖచ్చితంగా తినాలి. అయితే.. విటమిన్ బీ 12 ఎందులో ఉంటాయంటే? పాలు, పాలకు సంబంధించిన ఇతర పదార్థాలు, చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ లలో కావాల్సినంత విటమిన్ బీ 12 ఉంటుంది. ఈ విటమిన్ ను కావాలంటే.. ఖచ్చితంగా ఈ ఫుడ్ ను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిందే. విటమిన్ బీ 12 సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి కానీ.. ఫుడ్ సప్లిమెంట్స్ అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మిగితా సమయాల్లో తీసుకోకూడదు. ఈ విటమిన్ కోసం ఫుడ్ నే ఎక్కువగా తీసుకుంటే బెటర్. తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. విటమిన్ బీ 12 డెఫిషియెన్సీ వల్ల వచ్చే ఎన్నో సమస్యలు తగ్గుతాయి.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.