2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి అక్క‌డ గ‌ట్టి పోటీ త‌ప్ప‌దా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి అక్క‌డ గ‌ట్టి పోటీ త‌ప్ప‌దా…?

 Authored By kondalrao | The Telugu News | Updated on :9 June 2021,9:24 am

vizianagaram: విజయనగరం జిల్లాలోని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో గడచిన 30 ఏళ్లకు పైగా ఇద్దరే ఇద్దరు నాయకులు పొలిటికల్ గా తలపడుతున్నారు. వాళ్లు.. పూసపాటి అశోక్ గజపతి రాజు, కోలగట్ల వీరభద్ర స్వామి. వీళ్లిద్దరిలో రాజు గారిదే ఎక్కువ సార్లు పైచేయి అయింది. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. స్వామి గారు కూడా తన ప్రభావాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనే స్థానిక ఎమ్మెల్యే. పార్టీ వైఎస్సార్సీపీ. ఈ నేతలిద్దరూ ఇప్పుడు వయసు మీద పడటంతో తమ రాజకీయ వారసులను రంగంలోకి దించటానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2019 శాసన సభ ఎన్నికల్లో రాజు కూతురు అతిథి గజపతిరాజు.. స్వామిపై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. తద్వారా రాజు, ఆయన బిడ్డ ఇద్దరూ కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో పరాజయం పొందిన చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అశోక్ 2004లో స్వామిపై పోటీ చేసి చతికిల పడ్డాడు.

ఇట్లు.. శ్రావణి..

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ వీరభద్రస్వామి సైతం ముందుచూపు ప్రదర్శిస్తున్నారు. తన కుమార్తె శ్రావణిని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే క్యాండేట్ గా నిలబెట్టి నెగ్గాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ముందు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో విక్టరీ కొట్టడం ద్వారా రేప్పొద్దున శాసన సభకు సిద్ధం కావాలని ప్లాన్ వేశారు. దాన్ని అమలు కూడా చేస్తున్నారు. మరో వైపు అతిథి గజపతిరాజు కూడా కష్టపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.

Ysrcp

Ysrcp

వారసురాళ్ల వార్ లో..: Raju Vs Swami

ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయనగరంలోనే కాదు. ఆంధ్రప్రదేశ్ మొత్తమ్మీద అధికార పార్టీ వైఎస్సార్సీపీకి మంచి పేరే ఉంది. కాబట్టి 2024 ఎన్నికల్లో మళ్లీ ఈ పార్టీకే ప్రజలు పట్టం కట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని పొలిటికల్ పండితులు అంచనా వేస్తున్నారు. కాబట్టి కోలగట్ల వీరభద్రస్వామి గనక వచ్చే ఎలక్షన్ లో తన కూతురు శ్రావణిని రూలింగ్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టగలిగితే ఆమె తన ప్రత్యర్థి అతిథి గజపతిరాజును అవలీలగా మట్టికరిపిస్తుంది. దీంతో విజయనగరానికి విజయవంతమైన వారసురాలిగా శ్రావణి ప్రస్థానం ప్రారంభం కావొచ్చు. ఓటర్ల ఆశీస్సుల కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్న అతిథి గజపతిరాజుకి ఒకవేళ సానుభూతి (గత ఎన్నికల్లో ఓడిపోయింది కదా అనే జాలి) గనక వెల్లువెత్తితే చెప్పలేం గానీ ప్రజెంట్ ఫీడ్ బ్యాక్ ప్రకారం మాత్రం విజయనగరానికి కాబోయే శాసన సభ్యురాలు శ్రావణే అనటంలో ఎలాంటి సందేహం లేదు. రాజు వర్సెస్ స్వామి ఫైట్ రానున్న రోజుల్లో అనూహ్యమైన మలుపులేమైనా తిరుతుందేమో చూడాలి.

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది