అశోక్ గజపతిరాజు మళ్ళీ తెరమీదకి.. ఉత్తరాంధ్ర రాజకీయాలపై దీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ !
Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజు గుర్తున్నారా మీకు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత అప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి కావడంతో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన అశోక్ గజపతిరాజుకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది బీజేపీ ప్రభుత్వం. కానీ.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకోవడంతో ఆయన పదవి కూడా పోయింది. అప్పటి నుంచి అశోక్ గజపతిరాజు అంతగా రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. తాజాగా ఆయన మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. వైసీపీ సీనియర్ నేత, మంత్ర బొత్స సత్యనారాయణపై విమర్శల వర్షం కురిపించారు. ఇద్దరూ ఒకరి మీద మరొకరు మాటల యుద్ధం పేల్చారు.
నిజానికి ఈ ఇద్దరు నాయకులు ఒకే జిల్లా విజయనగరానికి చెందిన వారు. అందుకే విజయనగరం రాజకీయాల్లో ఇద్దరి టాపిక్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరి విమర్శలకు సీఎం జగన్ కేంద్రంగా మారారు. ముందు అశోక్ గజపతి రాజు ఏమన్నారంటే.. చంచల్ గూడ జైలు నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకు జగన్ ట్రాన్స్ ఫర్ పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించారు. చంచల్ గూడ జైలులో చిప్ప కూడు తిన్న దొంగనా మనం ఆంధ్రాకు ముఖ్యమంత్రిని చేసింది. వీళ్లా అభివృద్ధి చేసింది.. అంటూ అశోక్ గజపతి రాజు సీరియస్ అయ్యారు.
Ashok Gajapathi Raju : అశోక్ గజపతి రాజు ఒక గల్లీ నేతగా వ్యాఖ్యలు చేస్తున్నారు
సీఎం జగన్ సమాజానికి అంకితం అయ్యారు. ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి గజపతి రాజు మాట్లాడేటప్పుడు వెనుకా ముందు చూసుకోవాల్సిన పని లేదా? ఆలోచించి మాట్లాడాలి. మాకు ఎలాంటి వ్యక్తిగత విద్వేషాలు ఉండవు. సీఎం జగన్ కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న అశోక్ గజపతి రాజు.. ఒక గల్లీ నేతగా వ్యాఖ్యలు చేయడం బాధాకరం అంటూ బొత్స సత్యనారాయణ.. అశోక్ గజపతిరాజుకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.