YS Jagan : మూడు రాజధానులపై సీఎం జగన్ కొత్త ప్లాన్ అదా.. ఎన్నికల ముందు రచ్చ రచ్చే ఇక | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : మూడు రాజధానులపై సీఎం జగన్ కొత్త ప్లాన్ అదా.. ఎన్నికల ముందు రచ్చ రచ్చే ఇక

 Authored By kranthi | The Telugu News | Updated on :4 November 2022,2:20 pm

YS Jagan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మూడు రాజధానుల చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే.. ఓవైపు ఒకటే రాజధాని ముద్దు.. అదే అమరావతి అంటూ అమరావతి రైతులు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులే ముద్దు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఖచ్చితంగా ఉండాల్సిందేనని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మూడు రాజధానులపై తగ్గేదేలే అన్నట్టుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. అమరావతే అసలైన రాజధాని అంటూ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది.

దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. త్వరలో కొత్త ధర్మాసనం ఈ కేసును పరిశీలించనుంది. కేసుపై ఇంకా వాదోపవాదాలు జరగాల్సి ఉంది. ఈనేపథ్యంలో సీఎం జగన్ సరికొత్త రూట్ ఎంచుకున్నారు. మూడు రాజధానులపై తన పంథాను కొనసాగించనున్నారు. అందుకే.. విశాఖ నుంచి త్వరలో పరిపాలన ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దానికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా విశాఖకు వెళ్లిపోతారని..

what is ys jagan next plan on three capitals in ap

what is ys jagan next plan on three capitals in ap

YS Jagan : విశాఖ నుంచి త్వరలో పరిపాలన ప్రారంభం

సీఎం జగన్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన సాగుతుందని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉంటారని తెలుస్తోంది. విశాఖ రాజధానికి ముహూర్తాన్ని సంక్రాంతికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అంటే విశాఖ నుంచి సీఎం జగన్ త్వరలో పాలన సాగిస్తున్నారన్నమాట. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు ఎలాంటి స్పందన తెలియజేస్తారో. అలాగే.. కర్నూలులోనూ త్వరలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ.. హైకోర్టు అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇవ్వడం, సుప్రీంకోర్టులో ఇంకా కేసు పెండింగ్ లో ఉండటంతో అసలు మూడు రాజధానుల అంశం ఎటువైపు వెళ్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది