Whatsapp : వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్.. నెంబ‌ర్ సేవ్ చేయ‌కుండానే మెసేజ్ చేయోచ్చు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Whatsapp : వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్.. నెంబ‌ర్ సేవ్ చేయ‌కుండానే మెసేజ్ చేయోచ్చు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 March 2022,4:30 pm

Whatsapp : వాట్సాప్‌ మెసేజింగ్ యాప్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. యూజర్ల అవరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అందుకే ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉండడంతో వాట్సాప్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. యూజ‌ర్స్ నిత్యం చాటింగ్‌లు, వాట్సాప్‌ స్టేటస్‌లతో బిజీగా ఉంటారు. అయితే యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలంటే ముందుగా మొబైల్‌లో ఆ నంబర్‌ సేవ్‌ చేసి ఉండాలి. అయినే చాటింగ్‌, మెసేజ్ లు పంపేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ నంబర్‌ సేవ్‌ చేసుకోకుండా కూడా వాట్సాప్‌ మెసేజ్‌ పంపవచ్చు. ఇక థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్ లో మెసేజ్‌ చేసే అవకాశం ఉంది. వాట్సాప్‌లో నంబర్‌ లేకుండా మెసేజ్ ఎలా పంపాలి లేదా కాంటాక్ట్ యాడ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసుకోండి. ముందుగా మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌) ఒపెన్‌ చేయండి.ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లోపేస్ట్‌ చేయాలి.

whatsapp comes with new feature

whatsapp comes with new feature

Whatsapp : వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్..

ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశం కోడ్‌ 91తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఉదాహరణకు మీ వాట్సాప్‌లో సేవ్‌ చేసుకోలేని ఓ వ్యక్తి నెంబర్‌కు http://wa.me/919911111111 ఎంటర్‌ చేయాలి. ఇక్కడ తొలి రెండు అంకెలు మన దేశ కోడ్‌. తరువాత మెసేజ్‌ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌. తరువాత మీరు వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌బటన్‌పై క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్లించబడతారు. అంతే మీరు వ్యక్తి నెంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్‌ చేయవచ్చును.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది