WhatsApp Voicemail | వాట్సాప్‌లో వాయిస్‌మెయిల్, మిస్డ్ కాల్ రిమైండర్ ఫీచర్లు .. యూజర్లకు మరింత సౌలభ్యం
WhatsApp Voicemail | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్! ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు కొత్త ఫీచర్లను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కాల్ షెడ్యూలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్, తాజాగా వాయిస్‌మెయిల్ , మిస్డ్ కాల్ రిమైండర్ ఫీచర్లను పరీక్షిస్తోంది.

#image_title
కొత్త వాయిస్‌మెయిల్ ఫీచర్ ఏమిటి?
ప్రముఖ వాట్సాప్ అప్‌డేట్ ట్రాకర్ WABetaInfo తాజా రిపోర్టు ప్రకారం, వాయిస్‌మెయిల్ స్టైల్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వారి కాల్‌కు సమాధానం రాకపోతే తక్షణమే వాయిస్ మెసేజ్ పంపగలుగుతారు. వాయిస్ కాల్ ఆన్స్ చేయనప్పుడు, స్క్రీన్‌పై “Cancel”, “Again Call”, “Record Voice Message” అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘రికార్డ్ వాయిస్ మెసేజ్’ను ఎంచుకుంటే, కాలర్ ఒక క్విక్ వాయిస్ మెసేజ్‌ను రిసీవర్‌కు పంపగలుగుతాడు. ఇది ట్రెడిషనల్ వాయిస్‌మెయిల్‌లా కాకుండా, వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లోనే సులభంగా వినిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే iOS బీటా టెస్టర్లకు ఎప్పుడు అందుతుంది? అనే అంశంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. వాయిస్‌మెయిల్‌తో పాటు, వాట్సాప్ మరో వినూత్న ఫీచర్ అయిన మిస్డ్ కాల్ రిమైండర్‌ని కూడా టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒక మిస్డ్ కాల్‌కి రిమైండర్ సెట్ చేయవచ్చు. ఇది ఇప్పటికే చాట్ మెసేజ్‌లకు ఉన్న రిమైండర్ సిస్టమ్‌ను పోలి ఉంటుంది. ఇప్పుడది కాల్‌లకు కూడా విస్తరించనుంది.