WhatsApp : వాట్సాప్ కీలక నిర్ణయం… ఇక గ్రూప్స్ లో 1024 మంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

WhatsApp : వాట్సాప్ కీలక నిర్ణయం… ఇక గ్రూప్స్ లో 1024 మంది…!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 October 2022,2:00 pm

WhatsApp  : ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ ఉంటే కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడాలి అన్న చేయాలి అన్న కేవలం వాట్సాప్ ద్వారా చేసుకుంటున్నారు. ఇవాళ ఏం పని చేసిన, ఎక్కడికైనా వెళ్లిన దానిని వీడియో చేసి వాట్సాప్ లో పెడుతున్నారు. వాట్సాప్ గ్రూపులో అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అయితే గ్రూప్స్ విషయంలో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. దీంతో త్వరలో వాట్సాప్ గ్రూప్ లో 1000 మందికి పైగా సభ్యులు ఉండవచ్చు.

గతంలో ఓ గ్రూపులో గరిష్టంగా 256 మంది సభ్యులుగా ఉండేవారు. కొన్ని రోజుల క్రితం ఆసంఖ్యను 512 కు చేర్చింది. త్వరలో ఆ సంఖ్యను వాట్సాప్ 1024 కి పెంచనుంది. కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే సాధారణ యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి రానుంది. గ్రూప్ అడ్మిన్ ల కోసం అప్రూవల్ సిస్టం తీసుకురానుంది. ఎవరైనా గ్రూపులో చేరాలి అనుకుంటే అడ్మిన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. గ్రూపులో చేరేందుకు వచ్చిన మెసేజ్లు అన్ని ఒకచోట లిస్టులో కనిపిస్తాయి.

WhatsApp update groups 1024 members

WhatsApp update groups 1024 members

వాటిని అడ్మిన్ చెక్ చేసుకోని ఆ వ్యక్తి గ్రూపు సభ్యుడిగా వద్దు అనుకుంటే రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేయవచ్చు. వాట్సాప్ కాల్ లింక్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాలనుకునే వ్యక్తికి కాల్ లింక్ క్రియేట్ చేసి కాల్ మాట్లాడాలనుకునే వారికి పంపాలి. ఆ లింకును క్లిక్ చేసి నేరుగా ఆ వీడియో సమావేశంలో పాలుగొనవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ జూమ్, గూగుల్ మీట్ తరహాలో ఉంటుందని సమాచారం. యూజర్లు వాట్సాప్ స్టేటస్ లో ఆడియో మెసేజ్లను కూడా పెట్టుకోవచ్చు. స్టేటస్ బటన్ క్లిక్ చేస్తే వాయిస్ రికార్డ్ చేసి ఆప్షన్ వస్తుంది. దీని ద్వారా వాయిస్ స్టేటస్ పెట్టవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది