AC : కేవలం రూ.500లకే ఏసీ.. కరెంటు లేకున్నా పని చేస్తుంది!
AC : ప్రస్తుతం ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. పగటి పూట బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. ఉదయం నుండే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం వరకూ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ విపరీతమైన ఎండలకు ఇంట్లో కూడా మంటలు లేస్తున్నాయి. ఉక్కపోత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఫ్యాన్ వేసుకున్నా ఏమాత్రం చల్లదనం ఉండట్లేదు. కూలర్స్ కూడా అంతగా చల్లదనం అందించట్లేదు.ఈ వేడి గాలుల నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ ఏసీలు చాలా కోద్ది మంది ఇళ్లల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి వారు ఎండలకు తట్టుకోలేక, ఏసీలు కొనుక్కోలేక ఇబ్బంది పడతారు.
అలాంటి వారు ఎండాకాలంలో ఈ పని చేసినట్లయితే తక్కువ ఖర్చుతో ఏసీల కంటే కూడా చల్లదనం పొందవచ్చు. వీటి కోసం కరెంటు కూడా ఏమాత్రం అవసరం లేదు. రోజంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడితే కరెంటు బిల్లు కూడా పెరిగిపోతోంది. అలాంటి సమయంలో ఈ నేచురల్ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. దీని కోసం అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. ఇంటిపై కప్పుకు కూల్ పెయింట్ వేసుకోవాలి. దీని ద్వారా సూర్య కిరణాలు పెయింట్ మీద పడగానే వేడి లోపలికి రాకుండా ఉంటుంది.అలాగే కిటికీల నుండి వచ్చే వడగాల్పులు తగ్గాలంటే వట్టి వేర్ల చాపలను కట్టాలి.
గాలి రావాలంటే ఈ చాప ద్వారానే వస్తుందని కాబట్టి చల్లని గాలి లోపలికి వీస్తుంది. ఈ చాపలు ఇంటి చుట్టూ ఎండ పడే కిటికీలు అన్నింటికీ కట్టడం వల్ల ఇంట్లోకి ఏమాత్రం వేడి గాలి వచ్చే అవకాశమే ఉండదు. దీంతో ఇంట్లో చాలా చల్లని వాతావరణం ఉంటుంది. కరెంటు ఉన్నా లేకున్నా.. ఫ్యాన్లు ఆన్ చేసినా చేయకపోయినా ఇంట్లో చల్లదనం ఏమాత్రం తగ్గదు. అలాగే ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నేచురల్ గా చల్లదనాన్ని ఇస్తుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారు తక్కువ ఖర్చుతో ఇలా చేయడం వల్ల చల్లదనాన్ని పొందవచ్చు. ఈ ఎండాకాలం మొత్తం వేడిమి నుండి రక్షించుకోవడానికి ఈ చిట్కా చాలా చక్కగా పని చేస్తుంది.