KCR : సిట్టింగులందరికీ సీటు ఇస్తే తన సీటుకు ఎసరు వస్తుందా? కేసీఆర్ పునరాలోచనలో పడ్డారా?
KCR : టీఆర్ఎస్ పార్టీ,TRS Party, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ,BRS Party,గా అవతరించింది. త్వరలో తెలంగాణ,Telangana,లో అసెంబ్లీ ఎన్నికలు,Assembly Elections కూడా జరుగనున్నాయి. ఈనేపథ్యంలో సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ అని సీఎం కేసీఆర్ ముందే ప్రకటించారు. కానీ.. తాను తొందరపడి ఆ నిర్ణయం తీసుకున్నానా అని పునరాలోచనలో కేసీఆర్,kcr పడినట్టు తెలుస్తోంది. ఇంకొన్ని నెలలలో తెలంగాణ,Telangana, లో ఎన్నికలు,Elections ,జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. మరోవైపు బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని మార్చి..
జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచారు కేసీఆర్. ఈనేపథ్యంలో తెలంగాణలో ముందు అధికారంలోకి రావాలి కాబట్టి ఎలాగైనా గెలుపు కోసం కేసీఆర్ తెలంగాణపై ఫోకస్ పెట్టారు.అయితే.. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అని సర్వేలు చేయించగా.. చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోందని అంటున్నారు. అసలే సిట్టింగ్స్ అందరికీ టికెట్ ను ప్రకటించేశారు కేసీఆర్. ఈనేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉండటంతో ఏం చేయాలని కేసీఆర్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
KCR : టికెట్ వస్తుందో రాదో అని ఎమ్మెల్యేల టెన్షన్
ఈనేపథ్యంలో అసలు తమకు టికెట్ వస్తుందా? రాదా? అని నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. తమకు తామే సొంతంగా తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారు. ఒకవేళ తమ గురించి వ్యతిరేకంగా వస్తే.. తమను తాము మార్చుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. కానీ.. సిట్టింగ్స్ అందరికీ టికెట్ ఇస్తే.. తన సీటుకే ఎసరు వస్తుందని సీఎం కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే.. సర్వేల ప్రకారమే ముందుకు వెళ్లి కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకుండా ఆయా నియోజకవర్గాల్లో బలం ఉన్న నేతల వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారట. చూద్దాం మరి.. అసలు ఎంతమంది సిట్టింగులకు మళ్లీ కేసీఆర్ టికెట్లు ఇస్తారో?