Kodali Nani : విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు? కొడాలి నానికే చాన్స్ దక్కునుందా?
Kodali Nani : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లలో గెలవాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఆ దిశగానే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్లాన్స్ వేస్తున్నారు. ఓవైపు ఏపీ ప్రభుత్వ బాధ్యతలను చూసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటూ… వైసీపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడం కోసం సీఎం జగన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్స్ రచిస్తున్నారు..
గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే కూడా ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా పోనివ్వకుండా అన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలవాలని వైసీపీ తెగ ఆరాటపడుతోంది. గత ఎన్నికల్లోనే భారీ మెజారిటీతో వైసీపీ గెలిచింది. దాదాపుగా అన్ని ఎంపీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్యేలు కూడా 151 మంది గెలిచారు. ఈసారి ఆ 24 సీట్లను కూడా కైవసం చేసుకోవాలని వైసీపీ తెగ ఆరాటపడుతోంది.
Kodali Nani : కానీ.. వైసీపీకి ఎంపీ క్యాండిడేట్స్ కరువయ్యారా?
నిజానికి.. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచింది. అయినా కూడా కొన్ని చోట్ల వైసీపీ ఓడిపోయింది. అలాంటి సీట్లలో విజయవాడ ఒకటి. విజయవాడ లోక్ సభ సీటును వైసీపీ కోల్పోయిన విషయం తెలిసిందే. విజయవాడ లోక్ సభ పరిధిలో కూడా ఏడు అసెంబ్లీ సీట్లలో ఆరు వైసీపీ గెలుచుకున్నప్పటికీ… ఎంపీ సీటును మాత్రం గెలుచుకోలేకపోయింది వైసీపీ. విజయవాడ ఎంపీగా టీడీపీ అభ్యర్థి కేసినేని నాని గెలిచాడు. 2014 లోనూ ఆయనే గెలిచాడు. 2019 లోనూ గెలవడంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలని వైసీపీ కసరత్తులు చేస్తోంది. టీడీపీ అభ్యర్థికి దీటుగా ఎవరిని పెట్టాలని వైసీపీ భావిస్తోంది. ఈనేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా దించాలని వైసీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని.. విజయవాడను ఈసారైనా దక్కించుకుంటారా? లేదా? అనేది తెలియాలంటే ఎన్నికల టైమ్ వరకు ఆగాల్సిందే.