RTC Bus : ఆర్టీసీ బస్సు నంబర్ ప్లేట్ పై ‘Z’ లెటర్ ఎందుకుంటుందో తెలుసా..? తెలిస్తే షాక్
RTC Bus: ఆర్టీసీ బస్సులపై ఎప్పుడైనా ‘Z’ అనే అక్షరం ఉండటం గమనించారా..? అసలు అదే అక్షరం తెలుగు రాష్ట్రాల్లోని బస్సులపై ఎందుకు ఉంటుందనే అనుమానం ఇప్పటికే చాలా మందికి వచ్చిఉంటుంది. ఆర్టీసీ బస్సులపై ఈ అక్షరం ఉండటానికి నిజాం కాలం నాటి ఓ జ్ఞాపకం. అదేంటో దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1932 హైదరాబాద్ నిజాం నవాబుగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నారు. కాగా ఆయన తల్లి పేరు జహ్రా బేగం. ఈయన […]
RTC Bus: ఆర్టీసీ బస్సులపై ఎప్పుడైనా ‘Z’ అనే అక్షరం ఉండటం గమనించారా..? అసలు అదే అక్షరం తెలుగు రాష్ట్రాల్లోని బస్సులపై ఎందుకు ఉంటుందనే అనుమానం ఇప్పటికే చాలా మందికి వచ్చిఉంటుంది. ఆర్టీసీ బస్సులపై ఈ అక్షరం ఉండటానికి నిజాం కాలం నాటి ఓ జ్ఞాపకం. అదేంటో దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1932 హైదరాబాద్ నిజాం నవాబుగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నారు. కాగా ఆయన తల్లి పేరు జహ్రా బేగం. ఈయన కాలంలోనే ఆర్టీసీ బస్సు రవాణా వ్యవస్థను కేవలం 22 బస్సులతో ప్రారంభించారు.
అప్పుడు బస్సు నంబర్లు ఎచ్ వై జడ్ అనే అక్షరాలు ఉండేది.కాగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి మీద ఉన్న ప్రేమతో ముందు తన తల్లి పేరు తోనే బస్సు సేవలను ప్రారంభించాలని నిర్ణయించగా.. అలా ఒక వ్యక్తి పేరుతో పబ్లిక్ వాహనాలు నడపకూడదని ప్రభుత్వం సూచించడంతో తన తల్లి పేరు లోని మొదటి అక్షరాన్ని బస్సు నంబర్ ప్లేట్ లపై రాయించారు. ఇక కొన్ని సంవత్సరాలు గడిచినా అదే జడ్ అక్షరం ఇప్పటికీ కొనసాగుతోంది.
RTC Bus: తల్లిమీద ఉన్న ప్రేమతో..
ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఆ అక్షరాన్ని పెట్టడానికి గల కారణాన్ని గౌరవిస్తూ అది అలాగే కొనసాగిస్తున్నారు. అలా రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులన్నీ Z సిరీస్ తోనే రిజిస్టర్ అవుతున్నాయి. అయితే ఈ అక్షరం వెనక ఉన్న నిజం రిజిస్ట్రేషన్ శాఖ వాళ్లకి కూడా 1989 వరకు తెలియదని చెబుతున్నారు. అయితే ఈ జడ్ అక్షరం కేవలం ప్రభుత్వ వాహనాలకే పరిమితం అవుతాయి. అద్దెకి తీసుకున్న వాహనాలకి లేదా ప్రయివేటు బస్సులకు ఈ అక్షరం ఉండదు. అయితే ఇప్పటికి కూడా జడ్ అక్షరం ఆర్టీసీ బస్సులపై అలాగే కొనసాగుతుంది.