Revanth Reddy : తెలంగాణ రాజకీయం.. బీజేపీ జోరుతో రేవంత్ రెడ్డి చిన్నబోయాడేం?
Revanth Reddy : వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇంకా ఏడాదిన్నర గడువు ఉంది. కేసీఆర్ తల్చుకుంటే ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశాలు లేక పోలేదు. అందుకే ఏం జరిగినా ముందస్తుగా సిద్దంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ మరియు బీజేపీలు సిద్దంగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ఇప్పుడు డబుల్ ఉత్సాహంతో ఉన్నాయి. కేసీఆర్ కు అసలైన ప్రత్యర్థులం మేమే అన్నట్లుగా కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు పోటీ పడి మరీ సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్న ఈ సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రిలాక్స్ అవుతున్నారు.ప్రతిపక్షం ఒక్కటే ఉంటే ఖచ్చితంగా అది అధికార పక్షం కు ఇబ్బందిగా మారుతుంది.
కాని ఇక్కడ రెండు ప్రతిపక్షాలు ఉన్నాయి. కనుక అధికార పార్టీ టీఆర్ఎస్ కు పెద్ద కష్టం ఉండక పోవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రజల నాడిని అంచనా వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో రాజకీయ విశ్లేషకులు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల్లో ఏది వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు గట్టి పోటీ ఇస్తుంది అంటూ అంచనా వేసే పనిలో ఉన్నారు. బీజేపీ ఎప్పుడు లేనంత ఉత్సాహంతో తెలంగాణలో పని చేస్తుంది. బండి సంజయ్ ఏకంగా సీఎం పీఠం పై బీజేపీ ఎమ్మెల్యే కూర్చోబోతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నిక అయిన సమయంలో మీడియాలో హడావుడి తెగ కనిపించింది. టీఆర్‌ఎస్ కు కాలం చెల్లింది.. ఇక అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అంటూ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
Revanth Reddy : రేవంత్ రెడ్డి సైలెంట్ అవ్వడంకు కారణం ఏంటీ?
కాని ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చాలా దూకుడుగా వ్యవహరించడం మొదలు పెట్టాడో.. కేంద్ర నాయకత్వం వరుసగా రాష్ట్రంలో అడుగు పెట్టి టీఆర్ఎస్ ను ఢీ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో అప్పటి నుండి రేవంత్ రెడ్డి కాస్త తగ్గినట్లుగా మీడియాలో చర్చ మొదలు అయ్యింది. టీఆర్‌ఎస్ ను ఢీ కొట్టడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మౌనం ను పాటిస్తున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ మరియు బీజేపీలు స్నేహ పార్టీలు అని నిరూపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన వ్యూహాలు పన్ను తున్నాడు. రేవంత్ రెడ్డి చాలా రాజకీయ అనుభవం మరియు చతురత ఉన్న నాయకుడు. కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది ఎన్నికల నాటికి ఉవ్వెత్తిన ఎగసి పడే అవకాశం ఉందంటున్నారు.