Vangaveeti Radha Krishna : పొలిటికల్ ఆటలో కేవలం పావుగా మిగిలిపోయిన వంగవీటి వారసుడు.. తెలుగు న్యూస్ స్పెషల్ విశ్లేషణ
Vangaveeti Radha Krishna : వంగవీటి కుటుంబం గురించి జరుగుతున్న చర్చ ఈనాటిది కాదు. దశాబ్దాల నుంచి నడుస్తోంది. వంగవీటి కుటుంబంలో పెద్ద అయిన వంగవీటి మోహన్ రంగా హత్యకు గురయి నేటికి 34 ఏళ్లు అవుతోంది. నిజానికి.. వంగవీటి మోహన్ రంగా వల్లనే వంగవీటి కుటుంబం ఫేమస్ అయింది. అక్కడ రాజకీయాల్లో కీలకంగా మారింది. అయితే.. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే హత్యకు గురయ్యారు. అప్పుడు అధికారంలో టీడీపీ పార్టీ ఉన్నందున్న.. అసలు ఆయన హత్యకు గల కారణాలు, హత్య ఎవరు చేశారు అనేదానిపై నేటికీ స్పష్టత లేకుండా పోయింది. అయితే.. టీడీపీనే వంగవీటి రంగాను హత్య చేసింది అనే విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వంగవీటి రంగా హత్య గురించి ఎలాంటి నిజాలు నిగ్గుతేల్చలేకపోయింది.
సొంత పార్టీ నాయకుడు చనిపోతే కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది అనే అపవాదూ ఇప్పటికీ ఉంది. అయితే.. వంగవీటి రంగా వారసుల్లో వంగవీటి రాధాకృష్ణ ఒక్కరే రాజకీయాల్లో ఉన్నారు. అయితే.. వంగవీటి రాధాతో ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం రాధాకృష్ణ టీడీపీ పార్టీలో ఉన్నారు. దీంతో అధికార పార్టీ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరినీ ఉపయోగించుకొని ఆయనపై పలు ప్రయోగాలు చేస్తోంది. నిజానికి.. వంగవీటి రంగాతో కొడాలి, వల్లభనేనికి ఫ్రెండ్ షిప్ ఉన్న మాట వాస్తవమే. దాన్ని ఇప్పుడు అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. వంగవీటి రాధాకు వైసీపీ అంటేనే పడదు. కానీ.. కొడాలి, వంశీ ఇద్దరూ కలిసి వైసీపీని తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Vangaveeti Radha Krishna : రంగా వారసుడితో రాజకీయ పార్టీల పొలిటికల్ గేమ్
రాధాకృష్ణ మాత్రం టీడీపీకి దగ్గరయ్యారు. దీంతో రాధా ఇప్పుడు మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం చేసుకుంటోంది టీడీపీ. 2004 లో రాధా.. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికలప్పుడు పీఆర్పీ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ.. ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓడిపోయారో అప్పటి నుంచి వైసీపీ ఆయన్ను పక్కన పెట్టింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు. చివరకు టీడీపీలో అయినా ఆయనకు సరైన గౌరవం దక్కిందా అంటే అదీ లేదు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అందుకే ఏపీలోని పార్టీలన్నీ రాధాకృష్ణను అవసరం మేరకు వాడుకుంటున్నాయి. అవసరం తీరిపోయాక వదిలేస్తున్నాయి.