YS Jagan : వైఎస్ జగన్ మనసును వాళ్లు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నారు
YS Jagan : 2019 ఎన్నికల్లో ఏపీలో ఏం జరిగిందో తెలుసు కదా. ఏకంగా 151 సీట్లు సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. తన సత్తా చాటింది. ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. నిజానికి ఆ ఫలితాలతో జగన్ కూడా చాలా సంతోషించారు. అందుకే ఏపీలో ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలవాలని సీఎం జగన్ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ పథకాలను ప్రారంభించారు. 2019 ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తన మేనిఫెస్టోలోని నవరత్నాలను కూడా సీఎం జగన్ అమలు చేశారు.
ఎందుకంటే.. మళ్లీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టాలంటే ఖచ్చితంగా మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలి కదా. కేవలం సంక్షేమ పథకాలను అమలు చేయడం కాదు.. అసలు పథకాలపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది. వాళ్ల నుంచి వస్తున్న అభిప్రాయాలు ఏంటి.. అనేది తెలియాలి కదా. అందుకే సీఎం జగన్ తన సంక్షేమ పథకాలపై జగన్ సర్వేలు కూడా చేయిస్తున్నారు.
YS Jagan : ఎమ్మెల్యేల తీరుపై వ్యతిరేకత వస్తోందా?
సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. సర్వేలు పాజిటివ్ రెస్పాన్స్ ఉందని చెప్పడంతో సీఎం జగన్ ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. కొందరు ఎమ్మెల్యేల తీరుతోనే సమస్య ఉన్నట్టు సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని, ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని, సంక్షేమ పథకాల గురించి వాళ్లకు తెలియజేయాలని నిర్దేశించింది. దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలపై వివరిస్తున్నప్పటికీ..
కొందరు ఎమ్మెల్యేల తీరు వల్ల వైసీపీకి నష్టం కలుగుతోందని సీఎం జగన్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రతి వైసీపీ నేత అలర్ట్ గా ఉండాలి. అప్పుడే వైసీపీ గెలుస్తుంది. ఏ ఒక్క నేత ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది పార్టీకే తీరని నష్టం కలిగిస్తుంది. ఇవన్నీ ఆలోచించి సీఎం జగన్ అందరు నేతలను ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు జగన్ నివేదికలు తెప్పించుకుంటూనే ఉన్నారు. కొందరి విషయంలోనే సీఎం జగన్ కు కొత్త తలనొప్పులు వస్తున్నాయట. చూద్దాం మరి త్వరలో అయినా వైసీపీ నేతలు మారుతారో లేదో చూద్దాం.