జగన్ కు ఎందుకు ఈ పట్టుదల.. లోకేష్ కారణమా ..?
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఇంటర్ మరియు 10 వ తరగతి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయటమే లేక వాయిదా వేయటం చేశాయి. ఏపీ లో కూడా రోజుకు దాదాపు 15 వేల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షల విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళటం పట్ల అనేక వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించటం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో పాటు వాళ్ళ తల్లితండ్రుల జీవితాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయనే విషయాన్నీ జగన్ ఎందుకు మర్చిపోయాడో అర్ధం కావటం లేదని స్వయంగా వైసీపీ అభిమానులే చెపుతున్నారు. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ చాలా ప్రమాదకరం – వ్యాప్తిలో, ప్రాణాపాయంలో. కేసులు కోకొల్లలు, గతంలో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం తరుపున జరుగుతున్నా సహాయక చర్యలు కూడా తక్కువే అని చెప్పాలి.
పరీక్షల విషయంలో ఒక రకంగా నారా లోకేష్ కారణమా….?
ఇలాంటి స్థితిలో జగన్ పరీక్షల విషయంలో ముందుకు వెళ్ళటానికి ఒక రకంగా టీడీపీ నేత నారా లోకేష్ కారణమని చెప్పే వాళ్ళు లేకపోలేదు. ఆంధ్రాలో పరీక్షలు వాయిదా వేయాలని మొదటి నుండి లోకేష్ డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఒక దశ లో ప్రభుత్వం కూడా దీనిపై అలోచించి నిర్ణయం తీసుకోవాలని భావించింది. కానీ ఇప్పుడు పరీక్షలపై వెనక్కి తగ్గితే ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ ఖాతాలోకి వెళ్లిపోతుందేమో అనే భయం వైసీపీ నేతల్లో కలగటంతో పరీక్షలను వాయిదా వేయటం కంటే నిర్వహించటమే మేలు అనే నిర్ణయం తీసుకున్నరుని కొందరు విశ్లేషకులు చెపుతున్న మాట..
ఒక సమయంలో సీఎం జగన్ మాట్లాడుతూ 50 ఏళ్ల భవిష్యత్ ఈ పరీక్షలు అందుకే వాయిదా వేయటం లేదని చెప్పాడు.. మరి గత ఏడాది ఇంత కంటే తక్కువగానే కేసులు ఉన్నకాని పరీక్షలు వాయిదా వేశారు.. అప్పుడు గుర్తుకు రాలేదా 50 ఏళ్ల భవిష్యత్.. ? అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.. ఒక్క మాట మాత్రం నిజం సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఏమైనా తేడా జరిగితే అది జగన్ జీవితాంతం మోయాల్సిన మచ్చ … వంద మంచి నిర్ణయాలు కూడా ఒక తప్పుడు నిర్ణయం ముందు తూకంలో నిలబడలేవు.. ఈ విషయాన్ని సీఎం దృష్టిలో పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.