7th Pay Commission : హోలీ రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చిందా? డీఏ పెరిగిందా? ఎంత జీతం రానుంది?
7th Pay Commission : చాలా ఏళ్ల నుంచి డీఏ బకాయిలు, డీఏ పెంపు విషయంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే.. హోలీ రోజున కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుందని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ.. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను కేవలం 3 శాతం వరకే పెంచే అవకాశాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది.అది కూడా జనవరి 1, 2022 నుంచి ఆ పెంపు అమలు అయ్యేలా
కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే.. డీఏ, డీఆర్ పెంపు విషయంపై కేంద్రం విముఖత చూపించినట్టుగా తెలుస్తోంది. కేవలం 3 శాతం పెంపునకు మాత్రమే కేంద్రం ఆసక్తి చూపించినట్టుగా తెలుస్తోంది.రాజ్యసభలో ఇటీవల కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి కూడా ఇదే విషయంపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం 3 శాతం కంటే ఎక్కువ డీఏ పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం డీఏను అందిస్తున్నారు. ఒకవేళ 3 శాతం డీఏ పెంచితే అది 34 శాతం అవుతుంది.
7th Pay Commission : ప్రస్తుతం ఉన్న డీఏ శాతం
ప్రతి సంవత్సరం జనవరి, జులై రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం రివైజ్ చేస్తుంటుంది. ఈసంవత్సరం డీఏను 3 శాతం పెంచాలని.. సెవెన్త్ పే కమిషన్ సిఫారసు చేయడంతో కేంద్రం హోలీ పండుగ వరకు 3 శాతం పెంచి 34 శాతానికి చేయనున్నట్టు తెలుస్తోంది.అయితే.. ఇవాళే హోలీ కావడంతో కేంద్రం నుంచి ఆ నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.