Komatireddy Venkat Reddy : తమ్ముడి బాటలో నడుస్తాడా? భవిష్యత్తు రాజకీయాలపై కోమటిరెడ్డి షాకింగ్ నిర్ణయం?
Komatireddy Venkat Reddy : మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాక్షిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరాడు. ఇక.. మిగిలింది తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేడు. ఆయన కూడా పార్టీ మారుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన్ను పిలవడం లేదు. ఆయన కూడా వెళ్లడం లేదు. దీంతో తన తమ్ముడి లాగానే ఎంపీ పదవికి రాజీనామా చేసి వెంకట్ రెడ్డి బీజేపీలోకి చేరుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈనేపథ్యంలో ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కోమటిరెడ్డికి పిలువు వచ్చింది. బుధవారమే ఆయన ఢిల్లీకి కూడా వెళ్లారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీకి రావాలని కోమటిరెడ్డికి చెప్పారట. ఇప్పటికే సోనియా గాంధీకి కోమటిరెడ్డి తెలంగాణలో ఉన్న పరిస్థితులపై లేఖ రాశాడు.
Komatireddy Venkat Reddy : పీసీసీ మొత్తాన్ని పునరుద్దరించాలంటూ సోనియాకు లేఖ
తెలంగాణకు ఏఐసీసీ సెక్రటరీ ఇన్ చార్జ్ గా ఉన్న మాణికం ఠాగూర్ ను ఆ పదవి నుంచి తీసేయాలని, రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ మొత్తాన్ని పునరుద్దరించాలంటూ వెంకట్ రెడ్డి సోనియమ్మకు లేఖ రాశారు. దీంతో అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వెంకట్ రెడ్డిని ఢిల్లీకి రావాలంటూ సోనియా గాంధీ తెలిపారు.సోనియా గాంధీతో భేటీలో మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేయాలని సోనియా.. వెంకట్ రెడ్డిని కోరే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన మునుగోడు ఉపఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఒప్పుకోకపోతే, రేవంత్, ఠాగూర్ ఇద్దరినీ పదవుల నుంచి తీసేయాలనే డిమాండ్ నే సోనియా ముందు ఉంచితే.. సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసేంత వరకు ఢిల్లీలోనే ఉండాలని సోనియా వాళ్లకు చెప్పడంతో అక్కడే ఉండిపోయారు. వెంకట్ రెడ్డి గురించి కూడా తమకు తెలిసింది సోనియాకు రేవంత్ తో సహా ముఖ్యనేతలు సోనియాకు చెప్పిన సమాచారం. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన భవిష్యత్తు రాజకీయాలపై వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో తన భవిష్యత్తు రాజకీయాలపై వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుందని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.