Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల పన్నాగాలను సమాజం సహించదు. రాజగోపాల్ రెడ్డి !
ప్రధానాంశాలు:
Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల పన్నాగాలను సమాజం సహించదు. రాజగోపాల్ రెడ్డి !
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు. మీడియా స్వేచ్ఛ, పాత్రికేయ హక్కుల పరిరక్షణకు తన మద్దతు మరోసారి తెలియజేశారు. ఇటీవల సోషల్ మీడియా జర్నలిస్టులను కొంతమంది ప్రధాన మీడియా ప్రతినిధులు లక్ష్యంగా చేసుకుంటూ అవమానకర వ్యాఖ్యలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల పన్నాగాలను సమాజం సహించదు. రాజగోపాల్ రెడ్డి !
Komati Reddy Rajagopala Reddy : వారికి మద్దుతు..
“తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటినుంచి తన శక్తి మేరకు కృషి చేస్తోంది. అలాంటి జర్నలిస్టులను తక్కువచేసి మాట్లాడటం సబబు కాదు. సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి. ఈ వ్యవస్థను దూరం పెట్టాలన్న కుటిల ప్రయత్నాలను సమాజం ఊరుకోదు,” అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
సోషల్ మీడియా పాత్రికేయులకు తాను ఎప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేసిన ఆయన, ప్రజల పక్షాన నిలిచే జర్నలిస్టులను రాజకీయ ప్రయోజనాల కోసం టార్గెట్ చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియా వర్గాల్లో విశేషంగా చర్చకు దారితీశాయి. పలు జర్నలిస్టు సంఘాలు కూడా కోమటిరెడ్డి మాటలకు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి.