YS Sharmila : వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరట.. దానికి కారణం ఎవరో తెలుసా?
YS Sharmila : వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తన పేరు పెద్దగా వినిపించడం లేదు. గత రెండేళ్ల నుంచి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీని పెట్టి.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పంతో.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అంటూ తెలంగాణ ప్రజలకు చేరువ కావడం కోసం చేస్తున్నారు.తెలంగాణలో పార్టీ పెట్టి కొన్ని రోజులు యాక్టివ్ గా ఉన్న వైఎస్ షర్మిల ఈ మధ్య యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ తో వైరం పెట్టుకున్న వైఎస్ షర్మిల.. తెలంగాణలోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడం కోసం. తెలంగాణ ప్రజల నుంచి తనకు మద్ధతు తెచ్చుకోవడం కోసం. కానీ.. తను అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరినట్టుగా షర్మిలకు అనిపించడం లేదట. తెలంగాణలో ఉన్న వైఎస్సార్ అభిమానులను తనవైపునకు తిప్పుకొని తెలంగాణలో గెలవాలని షర్మిల భావించారు.కానీ.. తెలంగాణలో ఉన్న వైఎస్సార్ అభిమానులు, నేతలు ఎవ్వరూ ఆమె పార్టీలో చేరడం లేదు. ఆమె పార్టీతో జతకట్టడం లేదు. దానికి ఉదాహరణే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఇటీవలే వైఎస్ జగన్ ను కలిశారు. ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు సుముఖత చూపిస్తున్నారు కానీ..
YS Sharmila : తను ఆశించిన రెస్పాన్స్ తెలంగాణ ప్రజల నుంచి రాలేదా?
షర్మిల పార్టీలో చేరేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు అని తెలుస్తోంది.అందుకే.. తెలంగాణలో ఎక్కడా తన పార్టీలో జోష్ లేదు. చేరికలు లేవు. తన తండ్రి చేపట్టినట్టుగా పాదయాత్ర చేపడదామని అనుకున్నా.. అదీ వర్కవుట్ కాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ నుంచి తప్పుకోవాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది.తన పార్టీ ముఖ్యులు కూడా ఇప్పుడే ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రజల నుంచి రెస్పాన్స్ ఉండదేమో అని షర్మిలకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న మీమాంశలో షర్మిల ఉన్నట్టు తెలుస్తోంది.