Urea : పెద్దపల్లి జిల్లా.. యూరియా కోసం రైతన్నల పడిగాపులు
ప్రధానాంశాలు:
Urea : యూరియా కోసం రైతన్నల పడిగాపులు
Urea : పెద్దపల్లి జిల్లా జూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని పెద్దాపూర్, కుమ్మరికుంట, కోనరావుపేట, జూలపల్లి గ్రామాల రైతులు యూరియా కోసం గంటల తరబడి సింగల్ విండో కార్యాలయం వద్ద లైన్‌లో వేచి ఉన్నారు.
![Urea పెద్దపల్లి జిల్లా యూరియా కోసం రైతన్నల పడిగాపులు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Urea.jpg)
Urea : పెద్దపల్లి జిల్లా.. యూరియా కోసం రైతన్నల పడిగాపులు
ఒక్కో రైతుకు 4 బస్తాలు యూరియా మాత్రమే ఇవ్వగా, 10 ఎకరాల పైన ఉన్న రైతులకు ఎలా సరిపోతుందని అంతా ప్రశ్నించారు. కొంతమంది రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
పంటలకు సరిపడా యూరియా అందక ఇబ్బందులు పడుతున్నట్లు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి అని, బస్తాల కోసం లైన్‌లో నిలబడి కాళ్లు వాచేలా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉండకపోవడంతో వ్యవసాయ పనులు కూడా చేసుకోలేకపోతున్నట్లు తెలిపాడు. రైతులకు యూరియా సరిపడేలా అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరాడు.