Byreddy Siddharth Reddy : బైరెడ్డి సిద్ధర్ధ రెడ్డి లాంటి మొనగాళ్ళే జగన్ కి కావాలి.. ఈ సంఘటన చూడండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Byreddy Siddharth Reddy : బైరెడ్డి సిద్ధర్ధ రెడ్డి లాంటి మొనగాళ్ళే జగన్ కి కావాలి.. ఈ సంఘటన చూడండి

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 September 2022,3:30 pm

Byreddy Siddharth Reddy : ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏపీ ప్రభుత్వం గురించి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా లబ్ధిదారులకే అందుతున్నాయని చెప్పుకొచ్చారు. అవే పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తాయని బైరెడ్డి స్పష్టం చేశారు. నేరుగా ప్రజలకు నగదు బదిలీ అవుతుందని ఆయన అన్నారు. ఎక్కడ కూడా అవినీతి, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని బైరెడ్డి తిప్పికొట్టారు.

సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నా.. కావాలని టీడీపీ, ఇతర పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటి గురించి ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు. కేవలం కాలక్షేప రాజకీయాలు చేయడానికి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారని, ప్రభుత్వంపై ప్రజల్లో అసమ్మతి ఉందంటూ, వ్యతిరేకత ఉందంటూ నాయకులు చెప్పుతూ టైమ్ పాస్ చేస్తున్నారన్నారు. ప్రజలు ఎవరు కూడా ఏ పార్టీకి ఓటేస్తామో చెప్పుకోరని, దేనికైనా టైమ్ రావాలన్నారు.

YCP leader Byreddy Siddharth Reddy talks about ap govt

YCP leader Byreddy Siddharth Reddy talks about ap govt

Byreddy Siddharth Reddy : వైసీపీ పని అయిపోయిందంటున్నారు

మరోవైపు వైసీపీ పని అయిపోయిందని అంటున్నారు. సీఎం జగన్ ను గద్దె దించుతాం అని టీవీల్లో అంటున్నారు. నేను చాలెంజ్ విసురుతున్నా.. 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని అంటున్న నాయకులు నా చాలెంజ్ ను స్వీకరిస్తారా? అంటూ బైరెడ్డి ప్రశ్నించారు. ఇంకో 18 నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ సారి కూడా బంపర్ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందని బైరెడ్డి చెప్పుకొచ్చారు. 2024 లో వైసీపీ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా. నేను మాత్రమే కాదు.. నాలా జగన్ కోసం పని చేసే చాలామంది నాయకులు కూడా తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసిన వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నారంటూ బైరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ గెలిస్తే.. మా పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న ప్రత్యర్థ పార్టీల నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని బైరెడ్డి ప్రశ్నించారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది