WhatsApp : వాట్సాప్‌తోనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్.. ఎలాగంటే?
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ను ప్రజెంట్ ప్రతీ ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలో వాట్సాప్ యాప్ భాగమైపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే వాట్సాప్ యాప్ పేమెంట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. అలా వాట్సాప్ ప్లాట్ ఫాం ద్వారానే మీరు ఇతరకు డబ్బులు పంపించుకోవచ్చు. ఇందుకుగాను వాట్సాప్.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన యూపీఐను యూజ్ చేస్తోంది. ఈ యూపీఐ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.మీ బ్యాంక్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ తెలుసుకునేందుకుగాను తొలుత మీరు మీ వాట్సాప్ అకౌంట్‌తో లింకైన ఫోన్ నెంబర్ యూజ్ చేయాలి.
వాట్సాప్ యూజర్స్ మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందనే సంగతిని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకుగాను రెండు రకాల పద్ధతులున్నాయి. ఒకటి సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాంక్ బ్యాలెన్స్ ను డైరెక్ట్ గా చేసుకోవడం. కాగా, రెండో పద్ధతి ప్రకారం.. ఇతరులకు వాట్సాప్ ద్వారా మనీ సెండ్ చేసే టైంలో మనీని చెక్ చేసుకోవచ్చు. అలా మొత్తంగా రెండు పద్ధతుల ద్వారా వాట్సాప్ యాప్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు వాట్సాప్ పేమెంట్స్ యాప్ సెట్టింట్స్‌లోకి వెళ్లాలి.
WhatsApp : ఇలా మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..
అలా సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తర్వాత పేమెంట్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ మెథడ్స్ కిందున్న బ్యాంక్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అందులో మీరు చెక్ చేయాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ పైన వ్యూ అకౌంట్ బ్యాలెన్స్ అనే బటన్ చూసి.. దాని పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్‌లోని బ్యాలెన్స్ డిస్ ప్లే అవుతుంది. అలా ఈజీగానే మీ బ్యాంక్ అకౌంట్ లోని బ్యాలెన్స్ ను వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.