Rani Rampal : హాకీ స్టిక్ కూడా కొనలేని స్థితి నుంచి.. టీమిండియా కెప్టెన్ గా.. ‘రాణి’స్తున్న రాంపాల్ హార్ట్ టచింగ్ జర్నీ..!
Rani Rampal రాణీ రాంపాల్.. ఈ పేరు ఈ రోజు మధ్యాహ్నం వరకూ మన దేశంలో నూటికి 99 శాతం మందికి తెలియకపోవచ్చు. ఈమె మన దేశ హాకీ hockey టీమ్ కెప్టెన్. హాకీ స్టిక్ కూడా కొనలేని ఆర్థిక స్థితి నుంచి వచ్చి నేడు ప్రపంచ స్థాయిలో భారత జట్టుకు మరపురాని విజయాన్ని అందించింది. టోక్యో Tokyo Olympics 2021 లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఇవాళ మన అమ్మాయిలు సెమీ ఫైనల్ కి చేరారు. ఆ టీమిండియాని ముందుండి నడిపిస్తున్న సారథే ఈ రాణీ రాంపాల్. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా షాహాబాద్ మార్కండ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది.
పువ్వు పుట్టగానే.. Rani Rampal
రాణీ రాంపాల్ Rani Rampal ఇంటికి దగ్గరలో హాకీ అకాడమీ ఉంది. అక్కడ రోజంతా ప్రాక్టీస్ చేసే ప్లేయర్లను చూసి రాణీ Rani Rampal కి కూడా హాకీ hockeyక్రీడాకారిణి కావాలనే కోరిక చిన్నతనంలోనే కలిగింది. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్ ఇప్పించే స్థోమత ఆమె కుటుంబానికి లేదు. తండ్రి రోజువారీ సంపాదన రూ.80. తల్లి పని మనిషి. వాళ్లకు అసలు ఉండటానికి సరైన ఇల్లు లేదు. మూడు పూటలు తిండి దొరకటమే కష్టంగా ఉండేది. దోమల మోతకి కంటి నిండా నిద్ర పట్టేది కాదు. అయినా ఇవేవీ రాణీ Rani Rampal పట్టుదల ముందు నిలవలేదు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు రాణీ రాంపాల్ తన 6వ ఏటే టౌన్ లోని ఒక హాకీ టీమ్ లో చేరింది.
ఇంటా.. బయట.. Rani Rampal
‘నేను కూడా హాకీ hockey నేర్చుకుంటా’ అని రాణీ రాంపాల్ Rani Rampal అన్నప్పుడు ఇంట్లో వాళ్లతోపాటు కోచ్ కూడా ఒప్పుకోలేదు. సరైన తిండి లేక శారీరకంగా బక్కగా ఉండటంతో ఫిట్ నెస్ లేదంటూ ఆమెని అకాడమీలో చేర్చుకునేందుకు అంగీకరించలేదు. పంపించటానికి పేరెంట్స్ సైతం ఇష్టపడలేదు. అలాంటి స్థితిలో ఒక విరిగిన హాకీ స్టిక్ తో సొంతగా ప్రాక్టీస్ చేసింది. స్పోర్ట్స్ యూనిఫాం సైతం లేకపోవటంతో సల్వార్ కమీజ్ వేసుకొనే సాధన చేసేది. ఆటపై తనకు ఎంత మక్కువ ఉందో నిరూపించుకొని అటు తల్లిదండ్రులను, ఇటు కోచ్ ని ఎట్టకేలకు ఒప్పించింది.
అన్నీ తానై.. Rani Rampal
రాణీ Rani Rampal ఇంట్లో వాచ్ కూడా ఉండేది కాదు. దీంతో పొద్దున్నే టయానికి ట్రైనింగ్ కి వెళ్లటం కష్టంగా ఉండేది. కరెక్టుగా అనుకున్న సమయానికి నిద్రలేపటానికి ఆమె తల్లి రాత్రిళ్లు మొత్తం మెలకువతోనే ఉండి వేకువ జామునే లేపేది. అకాడమీకి వెళ్లేటప్పుడు ప్రతిఒక్క ప్లేయరూ తప్పనిసరిగా అర లీటర్ పాలు తీసుకెళ్లాలి. రాణీ పేరెంట్స్ పావు లీటర్ పాలు మాత్రమే కొనివ్వగలిగేవాళ్లు. వాటికి రాణీ నీళ్లు కలిపి అర లీటర్ పాలు చేసేది. రాణీ పరిస్థితిని, ప్రతిభను గుర్తించిన కోచ్ చివరికి ఆమెకు తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చి అన్నీ తానై చూసుకున్నారు. హాకీ కిట్, షూ కొనిచ్చారు. బలమైన ఆహారం పెట్టారు.
శ్రమయేవ జయతే.. hockey player Rani Rampal
వీటితోపాటు ఆటలోని మెలకువలని ఒంట బట్టించుకునేందుకు రాణీ రాంపాల్ ఎంతో శ్రమించేది. ఏ రోజూ ప్రాక్టీస్ మానేదు కాదు. రాణీ కష్టం, వాళ్లందరి సహకారం ఊరికే పోలేదు. హాకీలో ఆమె క్రమంగా రాణించటం మొదలైంది. టోర్నమెంట్లు గెలిచి సొంతగా డబ్బు సంపాదించే స్థితికి చేరుకుంది. తొలిసారి రాణి అందుకున్న శాలరీ రూ.500. వాటిని తండ్రికి ఇచ్చింది. అంత మొత్తం చూడటం ఆయనకు అదే తొలిసారి. అప్పుడే రాణీ తన పేరెంట్స్ కి ఒక మాట కూడా ఇచ్చింది. ఏదో ఒక రోజు మనం మంచి ఇల్లు కట్టుకుంటామని.
15 ఏళ్లకే నేషనల్ టీమ్ లోకి.. hockey player Rani Rampal
హర్యానా తరఫున ఎన్నో ఛాంపియన్ షిప్పుల్లో పాల్గొన్న రాణీ రాంపాల్ అతి చిన్న వయసులోనే (15 ఏళ్లకే) జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. 2010లో వరల్డ్ కప్ లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటివరకు 200ల చిల్లర ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడింది. 130కి పైగా గోల్స్ చేసింది. ఇప్పుడు రాణీ రాంపాల్ ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది అమ్మాయిలు హాకీ నేర్చుకుంటున్నారు. ఆ విషయం తెలిసి ఆమె అప్పుడప్పుడూ ఎమోషన్ కి గురవుతుంటుంది. రాణీ రాంపాల్ కుటుంబం నాలుగేళ్ల కిందట సొంతిల్లు కట్టుకోగలిగింది. మరి, జీవితంలో ఒకింటిదానివి ఎప్పుడవుతావని బంధు మిత్రులు అడుగుతుంటే మన దేశానికి టోక్యోలో స్వర్ణ పతకాన్ని అందించాకే అవన్నీ అని చెబుబోంది. ఆ గోల్ (లక్ష్యం) సైతం నెరవేరే సమయం దగ్గర పడిందని అభిమానులు ఆశిస్తున్నారు.