Shanmukh Jaswanth : మద్యం మత్తులో యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్ రచ్చ రచ్చ.. మూడు కార్లను ఢీకొట్టి?
Shanmukh Jaswanth : షన్ముఖ్ జస్వంత్ గుర్తున్నాడా మీకు. అదేనండి.. యూట్యూబ్ స్టార్. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ హీరో. ఇప్పుడు గుర్తొచ్చాడా? రీసెంట్ గా సూర్య అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు. టిక్ టాక్ లో మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి. సోషల్ మీడియా గురించి తెలిసిన వాళ్లకు షన్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

youtube star shanmukh jaswanth hit and run case
సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన, షన్ముఖ్ జస్వంత్.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇద్దరూ కలిసి చాలా వెబ్ సిరీస్ లలో నటించారు.
ఇప్పటి వరకు ఏనాడు కూడా వివాదాల్లోకి రాని షన్ముఖ్.. తాజాగా అడ్డంగా బుక్కయ్యాడు. మద్యం మత్తులో షన్ముఖ్ హల్ చల్ చేశాడు. మద్యం తాగి కారును అతి వేగంగా నడిపి కార్లను ఢీకొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ వుడ్ లాండ్ అపార్ట్ మెంట్ వద్ద చోటు చేసుకుంది.
Shanmukh Jaswanth : షన్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్
షన్ముఖ్ మద్యం తాగి కారు నడపడమే కాకుండా.. కార్లను, బైకులను ఢీకొట్టి అక్కడి నుంచి పరారి అయినట్టు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే షన్ముఖ్ ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా… ఆయన పోలీసులను అడ్డుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.
మూడు కార్లు, రెండు బైకులను షన్ముఖ్ కారు ఢీకొట్టడం వల్ల ఒక యువకుడికి గాయాలయ్యాయి. ఆ యువకుడిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. షన్ముఖ్ ఇంటికి వెళ్లి కారును సీజ్ చేసి షన్ముఖ్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
