YS Jagan : వైఎస్ జగన్ చేస్తున్న మేలు, ‘పచ్చ’ కళ్ళకు కనిపించదెందుకు.?
YS Jagan ; పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అంటుంటారు. అందులో ఎంత నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ‘పచ్చ’ కళ్ళతో చూసేవాళ్ళకి మాత్రం, అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంటుంది. అదే అసలు సమస్య. ఆ పచ్చ కళ్ళు ఇంకేవో కాదు, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా. టీడీపీ నేతలు పొద్దున్న లేస్తే, వైసీపీ మీద ఆరోపణలు చేయడంతోనే దినచర్య మొదలు పెడతారు. దినచర్య పూర్తి చేసేది కూడా వైసీపీ మీద విమర్శలు చేయడంతోనే. ఏనాడన్నా టీడీపీ అనుకూల మీడియాలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకునన ఒక్క నిర్ణయం మీద అయినా ప్రశంసాపూర్వకమైన కథనం వచ్చిందా.?
ఛాన్సే లేదు. టీడీపీకి, టీడీపీ అనుకూల మీడియాకి అదొక రోగం అనాలా.? అదొక శాపం అనాలా.? అన్నది అర్థం కాని పరిస్థితి. రాజకీయాల్లో విమర్శలుండొచ్చు.. మీడియా అన్నాక, ప్రజల తరఫున మాట్లాడాల్సి రావొచ్చు. కానీ, మరీ ఇంత దారుణంగానా.? ఇంతకు ముందెన్నడూ మీడియా ఇలా లేదు.. ఇప్పుడు కొత్తగా ఈ పైత్యం ఇంతలా ముదిరి పాకాన పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడూ టీడీపీ అనుకూల మీడియా ఇలానే వ్యవహరించిందిగానీ, అప్పట్లో కాస్త బెటర్.
ఇప్పుడు మరీ దారుణం. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో సమానంగా, అంతకన్నా ఎక్కువగా టీడీపీ అనుకూల మీడియా ‘అతి’ చేస్తోంది. పోనీ, టీడీపీ అనుకూల మీడియా ‘అతి’లో అర్థం ఏమన్నా వుంటుందా.? అంటే, అదీ లేదాయె. విశాఖ అభివృద్ధిని విస్మరించారంటూ వైసీపీ మీద టీడీపీతోపాటు టీడీపీ అనుకూల మీడియా ఆరోపణలు చేస్తోన్న విషయం విదితమే. కానీ, విశాఖ చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యం చేయబడింది.. ఇప్పుడు వైసీపీ హయాంలోనే అభివృద్ధికి నోచుకుంటోంది. అది టీడీపీకి కనిపించదు, టీడీపీ అనుకూల మీడియాకీ కనిపించదు. కేవలం టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా వల్లనే విశాఖకు రాజధాని హోదా రాకుండా పోయిందన్నది నిర్వివాదాంశం.