YS Jagan : వైఎస్ జగన్ సంక్షేమ పథకాలపై కేంద్రం కూడా నజర్
YS Jagan : ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి.. పరిపాలన విధానం గురించి పక్క రాష్ట్రాల నుండి పలువురు వచ్చి మరీ తెలుసుకుంటున్న విషయం తెల్సిందే. ఏపీలో అమలు అవుతున్న వాలంటీర్ వ్యవస్థను పలు రాష్ట్రాల కమిటీలు వచ్చి మరీ తెలుసుకున్నాయి. ఇంకా రైతులకు అమలు చేస్తున్న ఉచిత రైతు భీమా ఇంకా పంట సాయం కు సంబంధించిన పథకాలను గురించి అధ్యయనం చేసేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు రావడం జరిగింది. ఇప్పుడు కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో అడుగు పెట్టినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతున్న రైతు భీమా అమలు ఎలా సాధ్యం అవుతుంది.. దేశ వ్యాప్తంగా ఆ పథకం అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క భీమాను అందించే అవకాశం ను కూడా పరిశీలిస్తున్నారు అంటూ వైకాపా వారి ద్వారా తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ది కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా కేంద్రంకు కూడా ఒక మోడల్ అన్నట్లుగా నిలవడం అభినందనీయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

YS Jagan central goverment very happy with ap schemes and development programs
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగు దేశం పార్టీ నాయకులు ముఖ్యంగా అధినాయకత్వం వైకాపా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరియు అభివృద్ది కార్యక్రమాలను విమర్శించడమే పని గా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇలాంటి సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. అయినా కూడా తెలుగు దేశం పార్టీ విమర్శలు మానుకోవడం లేదు. జగన్ పథకాలు ముందు ముందు మరింతగా ఏపీ ప్రజల అభివృద్దికి దోహదం చేస్తాయి అంటూ రాజకీయ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు.