ఇక్క‌డ నుండి ఎరిగి ‘కాకి’ అక్క‌డ వాలింది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ఇక్క‌డ నుండి ఎరిగి ‘కాకి’ అక్క‌డ వాలింది..!

Vishaka Politics : ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాలిటిక్స్ కి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. ఒకప్పుడు విలువలు, విశ్వసనీయత, నీతీ, నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ వంటి వాటికి కట్టుబడి రాజకీయం చేసేవారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కనపెట్టి ఒకే ఒక్క పాలసీని ఫాలో అవుతున్నారు. పాలిటిక్స్ లోకి వచ్చేటప్పుడు ఏ పార్టీలో చేరాం.. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏ పార్టీ టికెట్ తో నిలబడ్డాం.. అనే విషయాలను కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారే కావాలనే మర్చిపోతున్నారు. […]

 Authored By kondalrao | The Telugu News | Updated on :9 June 2021,5:35 pm

Vishaka Politics : ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాలిటిక్స్ కి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. ఒకప్పుడు విలువలు, విశ్వసనీయత, నీతీ, నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ వంటి వాటికి కట్టుబడి రాజకీయం చేసేవారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కనపెట్టి ఒకే ఒక్క పాలసీని ఫాలో అవుతున్నారు. పాలిటిక్స్ లోకి వచ్చేటప్పుడు ఏ పార్టీలో చేరాం.. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏ పార్టీ టికెట్ తో నిలబడ్డాం.. అనే విషయాలను కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారే కావాలనే మర్చిపోతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే అదే మన పార్టీ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పుకోవచ్చు.

30 మంది గెలిచినా..

మహా విశాఖ నగర పాలక సంస్థకు మొన్న మార్చిలో ఎన్నికలు జరిగాయి. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లు ఉండగా వాటిలో 30 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 58 మంది కార్పొరేటర్లు కలిగిన వైఎస్సార్సీపీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేపట్టింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నెగ్గిన టీడీపీ కార్పొరేటర్లకు తమ డివిజన్లలో పనులు కావట్లేదు. పెట్టుబడి తిరిగొచ్చే మార్గం కనిపించట్లేదు. దీంతో చేసేదేం లేక పచ్చ జెండాను పీకేసి జగనన్నకు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించి పట్టుమని మూడు నెలలు కూడా కాకముందే ముందుచూపు ప్రదర్శిస్తున్నారు. ఆలస్యమైతే ఆశాభంగం అనుకుంటూ తొందరపడుతున్నారు. రేపోమాపో వైఎస్సార్సీపీలోకి జంప్ చేయటానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

tdp leaders vishaka politics

tdp leaders vishaka politics

రాజధానిపై ఆశతో..: Vishaka Politics

ఏపీ గవర్నమెంట్ అతి త్వరలో వైజాగ్ నుంచి పనిచేయటం ప్రారంభించబోతోందని రూలింగ్ పార్టీ లీడర్లు, మంత్రులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితేం బాగాలేదు. వచ్చే ఎన్నికల నాటికైనా కోలుకుంటుందనే గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో బెల్లం ఉన్న చోటకే వెళ్లిపోవటం బెటర్ అని టీడీపీ కార్పొరేటర్లు భావిస్తున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో బాగా పట్టున్న నాయకుడు కాకి గోవింద రెడ్డి ఇప్పటికే వైఎస్సార్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డిని తెగ పొగిడేస్తున్నాడు. తనతోపాటు మరికొంత మందిని ఆ పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. జగన్ పార్టీ చేస్తున్న సంక్షేమ, డెవలప్మెంట్ కార్యక్రమాలకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాడు. గాజువాకలో తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నాడు. దీన్నిబట్టి ఆయన తదుపరి అడుగులు ఎటు అనేది తెలిసిపోతోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> అక్క‌డ వైసీపీ గ్రూప్ పాలిటిక్స్… టీడీపీకి ఇదే మంచి చాన్స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే కాన్పులో 10 మంది పిల్ల‌లు.

ఇది కూడా చ‌ద‌వండి ==>  2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి అక్క‌డ గ‌ట్టి పోటీ త‌ప్ప‌దా…?

ఇది కూడా చ‌ద‌వండి ==> Chiranjeevi : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. అందుకే వైఎస్సార్సీపీ సైలెంట్ గా ఉంటోందా..?

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది