అక్క‌డ వైసీపీ గ్రూప్ పాలిటిక్స్… టీడీపీకి ఇదే మంచి చాన్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

అక్క‌డ వైసీపీ గ్రూప్ పాలిటిక్స్… టీడీపీకి ఇదే మంచి చాన్స్‌..!

 Authored By kondalrao | The Telugu News | Updated on :9 June 2021,3:55 pm

Ysrcp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం ఇప్పుడు రాజకీయంతో గరంగరంగా మారింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావొచ్చని అంటున్నారు. అక్కడ మొత్తం 52 డివిజన్లు ఉన్నాయి. అందులోని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవటానికి అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు జగన్ పార్టీ గతేడాది నుంచే సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరంగా సాగిస్తోంది. ఈ విషయంలో టీడీపీ కూడా కాస్తో కూస్తో పోటీ ఇస్తూ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. కాకపోతే చంద్రబాబు పార్టీ తరఫున చెప్పుకోదగ్గ సంఖ్యలో నాయకులు లేకపోవటం పెద్ద లోటుగా మారింది. ఈ నేపథ్యంలో రూలింగ్ పార్టీ పైచేయి సాధిస్తుందని భావిస్తున్నా దీనికి గ్రూప్ పాలిటిక్స్ మైనస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు.

ఎవరెవరు?.. ఎక్కడెక్కడ?..

వైఎస్సార్సీపీలో ఎంపీ మార్గాని భరత్ రామ్, నగర సమన్వయకర్త డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రాజా నగరం శాసన సభ్యుడు జక్కంపూడి రాజా, ఆయన తమ్ముడు జక్కంపూడి గణేష్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తదితరులు చురుకుగా పాల్గొంటున్నారు. అదే టీడీపీలో అయితే రాజమండ్రి అర్బన్ వ్యవహారాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఒక్కడే యాక్టివ్ గా చూసుకుంటున్నారు. వాసు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కూడా అడపాదడపా సహకరిస్తున్నారు. ఇక, రాజమండ్రి రూరల్ నాయకుడు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అర్బన్ ప్రాంతాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ భారమంతా ఆదిరెడ్డి కుటుంబంపైనే పడింది.

Rajahmundry Ysrcp politics

Rajahmundry Ysrcp politics

టీడీపీకి.. గతమెంతో ఘనం..: Municipal Elections

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ మూడు సార్లు కైవసం చేసుకుంది. ఆ చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టాలని వైఎస్సార్సీపీ పట్టుదలగా ముందుకు పోతోంది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచే ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. కొవిడ్ తో చనిపోయినవారికి సొంత ఖర్చులతో అంత్యక్రియలు జరిపిస్తున్నారు. ఆకుల సత్యనారాయణ డాక్టర్ కావటంతో స్థానికులకు వైద్య పరంగానే కాకుండా విద్యా పరంగా కూడా సాయం చేస్తున్నారు. జక్కంపూడివాళ్లు కూడా తమ ఫౌండేషన్ ద్వారా జనాన్ని ఆదుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలహీనపడిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహేంద్రవరాన్ని వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకోవటం ఏమంత కష్టం కాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ముఠాలను పక్కన పెట్టి మూకుమ్మడిగా కదిలితే రాజమండ్రిని ఏలబోయేది కూడా జగన్ పార్టీయే అని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి==> 2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి అక్క‌డ గ‌ట్టి పోటీ త‌ప్ప‌దా…?

ఇది కూడా చ‌ద‌వండి==> Chiranjeevi : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. అందుకే వైఎస్సార్సీపీ సైలెంట్ గా ఉంటోందా..?

ఇది కూడా చ‌ద‌వండి==> YSRCP : వైసీపీ ఉరవకొండలో ఆ వర్గాన్ని అరవకుండా చేయలేరా వైఎస్ జ‌గ‌న్‌..?

ఇది కూడా చ‌ద‌వండి==> Ys Jagan Vs Bjp : జగన్ తో జగడానికి.. కాలు దువ్వుతున్న కమలనాథులు..?

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది