Guinness World Record : ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే కాన్పులో 10 మంది పిల్లలు..!
Guinness World Record : సాధారణంగా ఒక మహిళ ఒకసారి ఎంత మంది పిల్లలకు జన్మనిస్తుంది. మా అంటే కవలలు పుడుతారు.. అంతే కదా. కానీ.. అది చాలా అరుదుగా జరిగే విషయం. లక్షల్లో ఒక్కరికి కవలలు పుడుతారు. సర్లే అనుకుంటే.. ముగ్గురు పిల్లలు అనుకోవచ్చు. అది కూడా కోట్లలో కొందరికే జరుగుతుంది. కోట్లలో ఒక్కరికి నలుగురు కూడా పుట్టే అవకాశం ఉంటుంది కానీ.. ఒకే కాన్పులో 10 మంది పిల్లలను కన్నవాళ్లను ఎవరినైనా చూశారా? పదండి.. ఓసారి సౌత్ ఆఫ్రికా వెళ్లి వద్దాం.

south afric woman gives birth to 10 babies at a time
సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ మహిళ.. ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. షాక్ కు గురయ్యారా? అవును.. పైన ఫోటో చూశారుగా.. తన కడుపులో తనకు తెలియకుండానే 10 మంది పిల్లలను మోసింది ఆ తల్లి. 10 పిల్లలను ఒకే కాన్పులో కని.. గిన్నిస్ వరల్డ్ రికార్డునే బ్రేక్ చేసింది.
Guinness World Record : అంతకు ముందు కవలలకు జన్మనిచ్చిన మహిళ
తన ముందు కాన్పులో ఆ మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఇప్పుడు మాత్రం ఏకంగా 10 మందికి జన్మనిచ్చింది. ఇంతకీ తన పేరు ఏంటంటే.. గోసియామె తమారా సితోలె. తన వయసు 37. పిల్లలకు జన్మనిచ్చాక.. తను 8 మందికే జన్మనిచ్చానని అనుకుందంట. కానీ.. తీరా చూస్తే.. తను జన్మనిచ్చింది 10 మందికి. తను డెలివరీ కాకముందు.. స్కాన్ తీసినప్పుడు కూడా కడుపులో 8 మంది పిల్లలే ఉన్నారని డాక్టర్లు చెప్పారట. తీరా.. డెలివరీ అయ్యాక చూస్తే 10 పిల్లలు పుట్టారు. అందులో ముగ్గురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారట. చరిత్రలోనే ఇప్పటి వరకు 10 మందిని ఒకేసారి కన్నవాళ్లు లేరు. అందుకే.. గోసియామె వరల్డ్ రికార్డులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 10 మంది ఒకేసారి కంటే.. వాళ్లను decuplets అని అంటారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిథులు వెంటనే తన పేరును రికార్డులో ఎక్కించారట.
https://twitter.com/MaS1banda/status/1402181095911833600