Ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముగ్గురు లేదా నలుగురు మంత్రులను తొలగించి కొత్తగా అయిదు లేదా ఆరుగురిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్న మంత్రి పోస్టులు కొన్ని అయితే ఆశావాహులు మాత్రం చాలా మంది ఉన్నారు. మంత్రి పదవి కోసం ఆశ పడుతున్న వారిలో ఎక్కువ శాతం మంది రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారే కావడం ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు రెడ్డి సామాజిక వర్గం నుండి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే రెడ్డి రాజ్యం అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరింత మంది రెడ్లను మంత్రి వర్గంలోకి తీసుకోవడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. కాని ఆయనకు వివిధ జిల్లాల నుండి మంత్రి పదవి కోసం వస్తున్న దరకాస్తులు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నుండే అంటూ సమాచారం అందుతోంది.
రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారిని ఎక్కువ సంఖ్యలో మంత్రి వర్గంలోకి తీసుకుంటే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగానే మంత్రి వర్గ విస్తరణ విషయంలో వైకాపా అధినాయకత్వం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి రెడ్డి సామాజిక వర్గ నాయకులతో చర్చలు జరిపి వారిని ఒప్పంచి వారికి మరేదైనా పదవులు ఆఫర్ చేసి ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేస్తే బాగుంటుంది. లేదంటే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విమర్శలు తప్పవు అంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.