YS Jagan : కేంద్రంతో వైఎస్ జగన్ లాలూచీ నిజం కాదు.. ఇదే సాక్ష్యం
YS Jagan : తెలుగు దేశం పార్టీ నాయకులు పొద్దున లేస్తే కేంద్రంతో జగన్ లాలూచి పడ్డాడు.. ఆయన రాష్ట్రం యొక్క ప్రయోజనాలను పనంగా పెట్టాడు అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కేంద్రం వద్ద నోరు విప్పి మాట్లడక పోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అంటూ గతంలో ఎన్నో సార్లు కేంద్రం కు మరియు జగన్ కు సంబంధం ఉంది అంటూ తెలుగు తమ్ముళ్లు మరియు అధినేత చంద్రబాబు నాయుడు చినబాబు లోకేష్ బాబు కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ విషయమై మైరింత స్పష్టత వచ్చినట్లు అయ్యిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులు మరియు వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్దం అయిన సమయంలో సీబీఐ వారు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ వారు జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించవద్దు అంటూ కోర్టు లో పిటీషన్ వేయడం జరిగింది. దాంతో కోర్టు జగన్ విదేశీ పర్యటనకు నో చెబుతూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తో జగన్ కి ఎలాంటి రిలేషన్ ఉందో చెప్పకనే చెబుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వైకాపా నాయకులు ఈ విషయమై ప్రధానంగా చర్చించుకుంటున్నారు. జగన్ మరియు మోడీల మద్య సన్నిహిత సంబంధాలు ఉంటే..
ఒక వేళ మోడీకి అన్ని విధాలుగా జగన్ సహకరిస్తున్నాడు అనుకుంటే అక్కడ నుండి కూడా జగన్ కు సహకారం అందాలి కదా అంటూ వైకాపా వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఆధీనంలో ఉండే సీబీఐ ని జగన్ కు వ్యతిరేకంగా కోర్టు లో పిటీషన్ వేయకుండా మోడీ లేదా కేంద్ర ప్రభుత్వంలోని ఎవరో ఒకరు ఆపేవారు. కాని జగన్ కు మోడీతో కేంద్రం తో టీడీపీ వాళ్లు అనుకుంటున్నంత సఖ్యత లేదు అని దీంతో తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డి తన కూతురు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి పట్టా తీసుకుంటున్న నేపథ్యంలో పారిస్ కు వెళ్లి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని భావించాడు. కాని పరిస్థితి చూస్తే అది వర్కౌట్ అయ్యేలా లేదు.