Ys Jagan : ఆ ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్..!
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు మరియు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడం లేదనే అభిప్రాయం తో ఉన్నారు. అందుకు కారణం ఎమ్మెల్యేల అసమర్థత అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతన్నాడు. ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేల పని తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రభుత్వ పథకాలను కనీసం ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో వారు విఫలం అవుతున్నారని అసహనం వ్యక్తం చేశారట. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను వైకాపా నాయకుల అవినీతిని ఎండగడుతూ విమర్శలు చేస్తూ ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో వైకాపాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Ys Jagan : ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్..
ఏపీలోని ప్రతి గడప గడపకు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను చేర్చాలనే ఉద్దేశ్యంతో ప్రచారం చేస్తున్నారు. ఆ విషయమై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. సినీ ప్రముఖులతో కూడా ప్రచారం చేయించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకు వెళ్లేది కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖుల సమక్షంలో ఎమ్మెల్యేలకు శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నాడట.
మొత్తానికి ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రాబోయే రోజులు చాలా విషమ పరీక్ష ను ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం అధికార మరియు విపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలు అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Ys Jagan : ప్రభుత్వ పథకాలు ప్రచారం కీలకం..
ఏపీలో ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరును ప్రజలకు వివరించాల్సిన అవసరం చాలా ఉంది. వారు వాటి గురించి తెలుసుకుంటేనే తప్ప ప్రభుత్వం పై నమ్మకం కలుగదు. కనుక ఏపీలో ప్రభుత్వం సమర్థవంతంగా సాగాలంటే మళ్లీ కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలి అనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం.
ఇందులో చాలా కీలకం అయిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పథకాలను వివరించేందుకు ట్రైనింగ్ ఇప్పించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.