MLA Roja : ఉన్న పదవి ఊస్ట్… మంత్రి పదవి అయినా ఉందా జగన్ననా.. రోజా…!
చిత్తూరు జిల్లా : నగరి ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా జోడు పదవులు నిర్వహిస్తున్నారు రోజా MLA Roja . అనూహ్యంగా ఏపీఐఐసీ పదవి నుంచి ఆమెను తప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే అది కూడా ఆమె మంచికేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ Ys jagan ఆమెకు బంపరాఫర్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఏపీ ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల్లో భాగంగా ఏపీఐఐసీ నూతన చైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి నియమితులయ్యారు.మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడిన రోజా MLA Roja కి..
ఇప్పుడు నామినేటెడ్ పోస్టు కూడా దూరం కావడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదని వైఎస్ జగన్ Ys jagan సర్కార్ నిర్ణయం తీసుకుందని.. ప్రభుత్వం పాలసీలో భాగంగా ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టుల నుంచి ఉద్వాసన పలికారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రోజా MLA Roja. వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతూ ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్నారు. అసెంబ్లీ నుంచి సస్పెండై న్యాయపోరాటం కూడా చేశారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఘటనపై పోరాడి అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు విధానాలను ఎండగడుతూ వైఎస్ జగన్ వద్ద మంచి మార్కులే సంపాదించారు.
మంత్రి పదవని టాక్.. MLA Roja
గత 2019 ఎన్నికల్లో సొంతపార్టీలోని మరో వర్గం ఓడించాలని చూసినా ఘన విజయం సాధించి సత్తాచాటారు రోజా. దీంతో జగన్ క్యాబినెట్‌లో రోజాకి బెర్త్ ఖాయమని అంతా భావించారు. తండ్రి వైఎస్ తరహాలో సీఎం జగన్ మహిళకే హోం మంత్రి పదవి కట్టబెడతారని.. ఆ మహిళ రోజాయేనని కూడా ఒకానొక దశలో ప్రచారం జోరుగా సాగింది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. రోజాకి అమాత్య యోగం దక్కలేదు. నిరాశకు గురైన రోజాకి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టు ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా అవకాశం కల్పించారు. తాజాగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ఏపీఐఐసీ చైర్మన్ పోస్టు మరొకరికి కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో రోజాని ఏపీఐఐసీ పదవి నుంచి తప్పించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత 80 నుంచి 90 శాతం మంది మంత్రులు ఉండకపోవచ్చని.. కొత్త వారికి అవకాశం కల్పిస్తామని సీఎం జగన్ గతంలోనే స్పష్టంగా చెప్పారు. అందులో భాగంగానే తన కొత్త టీంలో అవకాశం కల్పించేందుకు రోజా జోడు పదవిని కట్ చేశారన్న వాదలు కూడా ఉన్నాయి. వచ్చే టీం ఎలక్షన్ క్యాబినెట్ కావడంతో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని.. బలమైన టీంని సిద్ధం చేసుకునే క్రమంలోనే నేతల జోడు పదవులు కట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దిరెడ్డిని కాదని.. peddireddy
అయితే చిత్తూరు జిల్లా సామాజిక సమీకరణల నేపథ్యంలో రోజాకి క్యాబినెట్ బెర్త్ దక్కుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన రెడ్డి సామాజికవర్గం నుంచి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. అదే వర్గానికి చెందిన రోజాకి మంత్రి పదవి కట్టబెడతారా? అనే సందేహాలున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మినహా మిగిలిన స్థానాల్లో వైసీపీ విజయం సాధించడంలో పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషించారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డికి పట్టుంది. తనకు నచ్చిన వారికి టిక్కెట్లు ఇప్పించి మరీ గెలిపించుకున్నారని పెద్దిరెడ్డికి పేరుంది. అలాంటి పెద్దిరెడ్డిని కాదని రోజాకి క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశమే లేదని చెబుతున్నారు. ఒకవేళ పెద్దిరెడ్డి ఉన్నా రోజాకి కూడా జగన్ అవకాశం కల్పిస్తారా? అసలు జగన్ మనసులో ఏముంది? రోజాకి న్యాయం చేస్తారా? ఆమెను మంత్రి పదవి వరించబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.