YS Jagan : ఆ ఎమ్మెల్యేలకు గండం.. వాళ్లను పక్కకు తప్పించేందుకు జగన్ ప్లాన్?
YS Jagan : ఓవైపు ఏపీ ప్రభుత్వాన్ని నడపడం, అభివృద్ధి కార్యక్రమాలను చూసుకోవడం, మరోవైపు వైఎస్సార్సీపీ పార్టీని చూసుకోవడం.. అన్నింటినీ ఒంటి చేత్తో నడిపిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిపై కూడా సమీక్ష చేస్తున్నారు. ఐప్యాక్ ద్వారా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. అయితే.. ఇటీవల నిర్వహించిన ఐప్యాక్ సర్వేలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి గెలవడం కష్టమని తేలిందట. ఈ 25 మంది కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లే. ఆయా నియోజకవర్గాల్లో చేసిన సర్వే, నివేదికల ఆధారంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీళ్ల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని అందువల్లే ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలను గెలిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలింది.
నిజానికి ఓ 50 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉందట. అందుకే వాళ్లను పిలిపించి వాళ్ల పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం జగన్ ఎమ్మెల్యేతో చెప్పారట. చెప్పడం కాదు.. ఒకరకంగా వార్నింగే ఇచ్చేశారట. తమ పనితీరు మెరుగుపరుచుకోకపోతే… వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని డైరెక్ట్ గా జగన్ చెప్పేశారట. అప్పుడే వాళ్లకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారట జగన్. ఏదో ఊరికే వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం కాదు.. నివేదికలను చూపించి మరీ.. ఎమ్మెల్యేలకు జగన్ షాకిచ్చారట. అయితే.. తమ పనితీరు మార్చుకోవాలని వాళ్లకు జగన్ ఆరు నెలల సమయం ఇచ్చారట.
YS Jagan : గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం తర్వాత మెరుగుపడిన ఎమ్మెల్యేల పనితీరు
అయితే.. ఏపీ ప్రభుత్వం ఇటీవల గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా కృషి చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా ఓ 25 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నారట. దీంతో వాళ్లు సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. కానీ.. ఇంకా మిగిలిన 25 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారట. ఎక్కువగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచే ఉన్నారట. ఐప్యాక్ సర్వేతో పాటు సీఎం జగన్ తన వర్గం ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. మరి.. ఈ 25 మంది భవిష్యత్తులో అయినా తమ పనితీరు మార్చుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.