Ys jagan : జగన్ వాళ్లకు పదవులు ఫిక్స్ చేశారట.. మళ్లీ అదే ఫార్ములా..
Ys jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రతి విషయంలోనూ సామాజిక వర్గం కోణంలో ఆలోచిస్తూ సీఎం జగన్ ముండుగు వేస్తున్నారు. త్వరలో భర్తీ చేసే శాసనమండలి పదవులు కూడా సామాజిక కోణంలోనే భర్తీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 17 నుంచి మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం మండలి ఎన్నికలపై అందరి నజర్ పడింది. మండలిలో చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం త్వరలో ముగియనుంది.
జగన్ ప్రతి ఎన్నికలను సామాజిక వర్గం వారిగానే చూస్తున్నారు. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు క్యాబినేట్ హోదా ఉన్న పదవులు కాబట్టి సామాజిక వర్గం అండ చూసే భర్తీ చేసే అవకాశం ఉంది. శాసనమండలిలో ప్రస్తుతం వైసీపీకి 18 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. ఖాళీలు భర్తీ అయితే ఆ బలం కాస్త 32కు చేరనుంది. దీంతో వైసీపీ మంచి దూకుడు మీద ఉంది. కొత్తగా మండలి చైర్మన్ గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషేన్ రాజును జగన్ ఎంపిక చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ys jagan
Ys jagan : ఇక్కడ కూడా అదే ఫార్ములానా..
డిప్యూటీ స్పీకర్ గా మరి మైనారిటీలను పదవి వరించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు శాసన సభ స్పీకర్ పదవిని బీసీలు, మరియు అగ్ర వర్ణాలకు చెందిన నేతలు మాత్రమే అధిరోహించారు. కాగా ప్రస్తుతం చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేటాయించాలని జగన్ చూస్తున్నారు. మరి ఆ పదవి ఎవరికి దక్కుతుందో అని చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఎవరికి పదవి దక్కినా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించనున్నారు.
కానీ కొద్ది మంది సీనియర్లు మాత్రం జగన్ తీసుకుంటున్న సామాజిక వర్గ నిర్ణయాలను విమర్శిస్తున్నారు. ఇలా సామాజిక వర్గాల వారీగా పదవులు ఇచ్చుకుంటూ పోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి ఏమవుతుందో వేచి చూడాలి. జగన్ తన డిసీషన్ విషయంలో వెనుకడగు వేస్తారా?