Ys Jagan : వైఎస్ జగన్ ధీమా సంక్షేమ పథకాలే వైసీపీ ప్రచారాస్త్రాలు.!
2024 ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో గెలుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు పన్నినా, గుంపులుగా ఎంతమంది తమతో పోటీకి వచ్చినా, సింహం సింగిల్‌గానే వస్తుందని పదే పదే వైసీపీ నేతలు చెబుతున్నారు. సాధారణంగా, ఏ ప్రభుత్వం పట్ల అయినా ప్రజల్లో కొంత వ్యతిరేకత వుంటుంది. ఐదేళ్ళ పాలన తాలూకు ఎఫెక్ట్ అది. ఏ ప్రభుత్వమైనా, ప్రజలకు వంద శాతం న్యాయం చేయలేదు. ఇది వాస్తవం.
రాష్ట్రంపై వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేటప్పటికే వున్న అప్పుల భారం, కేంద్రం సరైన రీతిలో సహకారం అందించకపోవడం, విపక్షాల కుట్రలు.. ఇలా చాలా కారణాలతో, వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని పనులు పూర్తి చేయలేకపోవచ్చు. వాటి కారణంగా కొంత వ్యతిరేకత వస్తుంది. అయితే,కష్ట కాలంలోనూ సంక్షేమ క్యాలెండర్ ఏమాత్రం మిస్ అవకుండా, సంక్షేమ పథకాల్ని పక్కాగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తుండడం పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతోంది. ఆ సానుకూలత ముందర చిన్న చిన్న వ్యతిరేకతలు సమసిపోతున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
175 సీట్లకి 175 సీట్లూ వైసీపీకి వచ్చేస్తాయని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. 2019 ఎన్నికల్లో వచ్చినట్టు 151 సీట్ల కంటే వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చేస్తాయనే విషయమ్మీద కూడా ఇప్పుడే ఓ అంచనాకి రాలేం. అయితే, వైసీపీని గద్దె దించే సత్తా మాత్రం విపక్షాలకు లేదు. రానున్న రెండేళ్ళలో సంక్షేమ పథకాల్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, అభివృద్ధినీ పరుగులు పెట్టిస్తే, 175 టార్గెట్ ఛేదించగలమని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలంగా నమ్ముతున్నారు.