YS Jagan : ఎవ్వరూ ఊహించని విధంగా.. మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వానికి కేంద్రం భారీ షాక్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఎవ్వరూ ఊహించని విధంగా.. మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వానికి కేంద్రం భారీ షాక్?

 Authored By sukanya | The Telugu News | Updated on :27 July 2021,7:30 pm

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోషారి షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్.జగన్ సర్కార్ కు ఝలక్ ఇచ్చింది. డిజైన్లు మార్చినప్పటికీ.. 2014 ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల మార్పుల వల్ల హెడ్‌ వర్క్స్‌ వ్యయం 5,535 కోట్ల రూపాయల నుంచి 7,192 కోట్ల రూపాయలకు పెరిగినట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపినట్టుగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గోదావరి ట్రైబ్యునల్‌ నియమ, నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలని అన్నారు. వాటిని సీడబ్ల్యూసీ ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని తెలిపారు. మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్‌ గ్రేడ్‌ల పెంపు, ఎగువ కాఫర్‌ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్‌ నిర్మాణం, గేట్‌ గ్రూవ్స్‌లో చిప్పింగ్‌ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్‌ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోందని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.

ys jagan to bad news from central govt

ys jagan to bad news from central govt

ప్రభుత్వ నిర్ణయంపైనే.. YS Jagan

ఇక పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే అని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానంతో ఏపీ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర పతనావస్థలో ఉన్న ప్రభుత్వానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టులో వ్యయం భరించాల్సి రావడం భారంగా మారనుంది.

bjp

bjp

నిధుల లేమితో ప్రాజెక్టు పనులు ఆపితే జనాల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. తాజా ప్రకటన నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్ .. పోలవరం అదనపు వ్యయంపై ఏం చేయనుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. దీన్నుంచి ఏవిధంగా బయటపడుతుందన్న చర్చ అటు పార్టీలోనూ, విపక్షాల్లోనూ అంతర్గతంగా సాగుతోంది. మరోవైపు దీనిపై తీసుకునే నిర్ణయాన్ని .. టీడీపీ ఆసక్తికరంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఖర్చుపై పయ్యావుల కేశవ్ .. చేస్తోన్న విమర్శలకు మరింత బలం పెరుగుతుందని, ఇది తమకు కలిసివచ్చే అంశమని టీడీపీ భావిస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది