Ys Jaganmohan Reddy : 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్సీపీకి రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఓట్లేసి గెలిపించారు. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఇది జరిగి రెండేళ్లు పూర్తయింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లలోనూ అధికార పార్టీ వైఎస్సార్సీపీకి అఖండమైన మెజారిటీని కట్టబెట్టారు. దీన్నిబట్టి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ జనాల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని కళ్లు మూసుకొని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై పబ్లిక్ ఏమనుకుంటున్నారో మరో విధంగా తెలుసుకుందామనే ఉద్దేశంతో డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తమవటం విశేషం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పగ్గాలను చేపట్టాక నవరత్నాలు పేరుతో చాలా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టారు. వాటి వల్ల దాదాపు ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోంది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలు సైతం అదే విషయాన్ని సర్వేలో వెల్లడిస్తుండటం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, అమ్మఒడి, చేయూత, ఇంటింటికీ రేషన్ సరుకులు, పింఛన్, రైతు భరోసా తదితరఅన్ని స్కీములు బాగున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటాన్నీ సగం మంది స్వాగతిస్తున్నారు.
ఏపీలోని మెజారిటీ పీపుల్ రూలింగ్ పార్టీ వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతుండగా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, లెఫ్ట్ తదితర ప్రతిపక్ష పార్టీలను పట్టించుకున్న నాథుడు లేడని సర్వే వర్గాలు చెబుతున్నాయి. జనం దృష్టిలో పడేందుకు అపొజిషన్ పార్టీలు తలకిందులుగా తపస్సు చేసినా ఫలితం కనిపించట్లేదని పేర్కొంటున్నాయి. రెండేళ్ల కిందట ఎన్నికలు జరిగినప్పుడు విపక్ష పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని స్పష్టం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కమలనాథులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నారని అంటున్నాయి.
డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ చేస్తున్న ఈ సర్వే ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడలేదు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి తిరుగులేని అభిమానం ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటేనే బాగుంటుందని జనం అభిప్రాయపడుతున్నారట. లోకేష్ ని గానీ బాలయ్య బాబుని గానీ ఆ ప్లేస్ లో అంగీకరించబోమని తేల్చిచెబుతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ గుర్తు చేసుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ ఆఫీసు ఎక్కడ ఉందో, ఆ పార్టీలోని ఇతర నాయకులు ఎవరో తెలియదని నిర్మొహమాటంగా అంటున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.