YS Sharmila : వైఎస్ షర్మిల అన్నను బెదిరిస్తోందా? లేక నిజంగానే ఏపీలో పార్టీ పెట్టబోతోందా?
YS Sharmila : వైఎస్ షర్మిల గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జనాలు చర్చించుకుంటున్నారు. దానికి కారణం.. ఆమె చేసిన వ్యాఖ్యలు. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెట్టి.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అంటూ తెలంగాణ అంతటా పర్యటిస్తూ.. తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు వైఎస్ షర్మిల తెగ ప్రయత్నాలు చేస్తోంది.అందుకే.. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ.. పేద ప్రజలకు అండగా ఉంటానంటూ భరోసా ఇస్తోంది. అయితే..
చాలామంది రాజకీయ విశ్లేషకులు.. షర్మిల.. తెలంగాణలో కాదు.. ఏపీలో పార్టీ పెట్టి అన్నకు పోటీగా నిలబడాలి అంటూ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో.. ఏపీలో పార్టీ పెట్టకూడదని ఏం రూల్ లేదు కదా అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి.ఏపీలో పార్టీ పెట్టేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో ఆమె ఏపీలో పార్టీ పెట్టడం గురించి వ్యాఖ్యానించారు.

ys sharmila launch party in andhra pradesh against ys jagan
YS Sharmila : త్వరలో ఏపీలో పర్యటించనున్న షర్మిల
తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ తో తనకు విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో.. అన్నకు వ్యతిరేకంగా ఏపీలో పార్టీ పెట్టి షర్మిల నెగ్గుకు రాగలదా.. అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది.అందుకే.. త్వరలో ఏపీలో పర్యటన చేయాలని షర్మిల భావిస్తున్నారట. ఒకవేళ షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. జగన్.. తన సొంత చెల్లెలును ఎలా ఎదుర్కొంటారు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.