YS Sharmila : సర్వే.. ఆ ఒక్క చోట షర్మిల టీఆర్‌ఎస్ కొంప ముంచేలా ఉంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : సర్వే.. ఆ ఒక్క చోట షర్మిల టీఆర్‌ఎస్ కొంప ముంచేలా ఉంది

YS Sharmila: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఖాయం అయ్యింది. ఇప్పటికే ఆమె అధికారికంగా ప్రకటించింది. ఖమ్మంలో బాగా బలం ఉన్న కారణంగా ఆమె దృష్టి మొత్తం అక్కడే ఉంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి ఫోకస్‌ ఖమ్మం పైనే ఉంటుందని కూడా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా కూడా ఖమ్మంలో ఆమె పోటీ చేయడంతో […]

 Authored By himanshi | The Telugu News | Updated on :28 April 2021,2:30 pm

YS Sharmila: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఖాయం అయ్యింది. ఇప్పటికే ఆమె అధికారికంగా ప్రకటించింది. ఖమ్మంలో బాగా బలం ఉన్న కారణంగా ఆమె దృష్టి మొత్తం అక్కడే ఉంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి ఫోకస్‌ ఖమ్మం పైనే ఉంటుందని కూడా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా కూడా ఖమ్మంలో ఆమె పోటీ చేయడంతో పాటు అత్యంత సన్నిహితులను మరియు బలమైన నాయకులను ఖమ్మంలో పోటీ చేయించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల పార్టీ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేం కాని ఖమ్మంలో మాత్రం ఖచ్చితంగా తీవ్ర ప్రభావం ఉంటుందని ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది.

YS Sharmila: ఖమ్మంలో పాగా..

ys sharmila political party survey effect in khammam

ys sharmila political party survey effect in khammam

షర్మిల ఖమ్మంలో పాగా వేయడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్‌ కు ఖమ్మంలో ఉన్నంత అభిమానులు ఇతర జిల్లాల్లో లేరు అనేది తెల్సిందే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో వైకాపా సాధించిన సీట్ల గురించి అందరికి తెల్సిందే. అక్కడి వారికి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరియు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానంగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే షర్మిల ఖమ్మం నుండి పోటీ చేయాలని భావిస్తుంది. అలాగే ఖమ్మంలో తన రాజకీయ జెండా ఎగురవేయాలని ఆశ పడుతుంది. మొదట ఖమ్మంలో పాగా వేస్తే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించవచ్చు అనేది ఆమె అభిప్రాయం.

వైకాపా ప్రభావం..

ఖమ్మంలో వైకాపా ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అందుకే ఆమె ఖమ్మం అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతుంది. ఖమ్మం జిల్లాను మంత్రి పువ్వాడ అభివృద్ది పథంలో తీసుకు వెళ్తున్నాడు. అయినా కూడా అక్కడి జనాలు షర్మిల వైపు చూస్తున్నారు అనేది ఒక సర్వే ఫలితం. మెజార్టీ స్థానాలను ఖచ్చితంగా షర్మిల పార్టీ ఖమ్మంలో గెలుచుకుంటుంది. ఇతర జిల్లాల్లో ఖాతా తెరవకున్నా ఖమ్మంలో మాత్రం ప్రభావం చూపించడం పక్కా అంటూ స్వయంగా షర్మిల వర్గీయులు కూడా అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది