YCP Candidates List : 2024 ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులు వీళ్లే.. ఇదే ఫైనల్ లిస్ట్.. 27 మంది ఔట్?
YCP Candidates List : ఏపీలో ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న సదుద్దేశంతో రంగంలోకి దిగింది. సీఎం జగన్ 2024 ఎన్నికల కోసం పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల టీమ్ రెడీ అవుతోంది. దాని కోసమే సీఎం జగన్ పలు కీలక మార్పులు చేస్తున్నారు. పలువురు నేతలను కీలక బాధ్యతల నుంచి తప్పించారు. పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరును పలు సర్వేల ద్వారా తెలుసుకున్న సీఎం జగన్.. చివరకు ఎవరికి టికెట్ ఇవ్వాలి..
ఎవరికి ఇవ్వకూడదు అనేదానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఐప్యాక్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్, ఇతర సర్వే సంస్థలు చేసిన సర్వే ప్రకారమే.. వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు జగన్.దానికోసమే పార్టీ సెంట్రల్ ఆఫీసులో వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించబోతున్నారు. వచ్చే ఎన్నికలు టార్గెట్ గా ఆ ఎన్నికలు ఉండబోతున్నాయి. పార్టీ ముఖ్య నేతలంతా హాజరుకాబోతున్న ఈ సమావేశంలో అసలు ఏం జరగబోతోందో అని అంతా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశంలోనే వైసీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్టును సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే వీళ్లు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారు. ప్రజలతో మమేకం అవుతారు.
YCP Candidates List : ముందు 70 అనుకున్నా.. తర్వాత 27 మంది ఎమ్మెల్యేలకు నో టికెట్
నిజానికి.. ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలలో ముందు 70 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సర్వే రిపోర్ట్ లో తేలింది. 151 మందిలో 70 మంది పనితీరు బాగా లేకపోవడంతో వాళ్లకు సీఎం జగన్ పర్సనల్ గా పిలిచి మరీ క్లాస్ పీకారట. దీంతో అందులో కొందరు ఇప్పటికే సెట్ అయిపోయారు. దీంతో ప్రస్తుతం 70 గా ఉన్న ఆ లిస్ట్ కాస్త 27 కు చేరుకుంది. ఈ 27 మందికి కూడా సీఎం జగన్ ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినా వాళ్లు సెట్ అయ్యేలా కనిపించడం లేదని అనిపిస్తోంది. ఇప్పుడు సీఎం జగన్ ప్రకటించే లిస్టులో ఈ 27 మంది పేర్లు ఉంటాయా? ఉండవా? అనే టెన్షన్ తో ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు.
మరోవైపు పార్టీలో అధిపత్య పోరు కూడా జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీలో నేతల మధ్య ఉన్న సమస్యలపై కూడా జగన్ ఫోకస్ పెంచారు. అయితే.. మంత్రివర్గాన్ని విస్తరించినప్పటి నుంచే పార్టీలో విభేదాలు ముదిరాయని వార్తలు వస్తున్నాయి. కొందరికి పదవి రాలేదని, ఉన్నవాళ్లకు పదవి పోయిందని ఇలా రకరకాలుగా విభేదాలు ముదరడంతో ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే ఇలా పార్టీలోని నేతల మధ్యే సఖ్యత లేకుంటే ఎలా అని జగన్ దీనిపై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి.. ఇవాళ జరగబోయే సమావేశంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.