YSRCP : తన టాలెంట్ ను మరోసారి బయటపెట్టి.. అడ్డంగా వైసీపీని ఇరికించిన చంద్రబాబు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : తన టాలెంట్ ను మరోసారి బయటపెట్టి.. అడ్డంగా వైసీపీని ఇరికించిన చంద్రబాబు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 May 2021,8:30 pm

YSRCP : ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీ నేతలు కానీ.. కార్యకర్తలు కానీ.. వైసీపీ చెందిన వాళ్లు ఎవ్వరైనా సరే.. కొంచెం నోరు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే.. అసలే అధికారంలో ఉన్న పార్టీ.. వాళ్లు ఏమాత్రం నోరు జారినా.. అది పార్టీకే కాదు.. ప్రభుత్వానికి కూడా ఇబ్బందే. అందుకే.. పార్టీ నేతలు ఏం మాట్లాడినా కాస్త ఆచీతూచీ అడుగు వేస్తూ మాట్లాడాలి. ఏమాత్రం వాళ్లు నోరుజారిన.. ప్రతిపక్ష నేతలు దాన్నే పట్టుకొని రాద్ధాంతం చేస్తారు.. రచ్చ రచ్చ చేస్తారు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెగ ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైఎస్సార్సీపీ పార్టీని అడ్డంగా ఇరికించేశారు. ఇప్పుడు అడ్డంగా ఇరికిపోయాక.. ఎంత గింజుకుంటే మాత్రం ఏంటి లాభం.

ysrcp

ysrcp

అసలే.. చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నారు. పార్టీ పరువు పోయింది. అసలు పార్టీయే నామరూపం లేకుండా పోయింది ఏపీలో. ఇప్పుడిప్పుడే పార్టీని ఏపీలో బలపరచడం కోసం తెగ కష్టాలు పడుతున్న చంద్రబాబుకు… అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆయనకు అడ్డంగా వైసీపీ నేతలు దొరికిపోతున్నారు. చంద్రబాబుకు వైసీపీ అనుకోకుండానే మైలేజీ ఇస్తోంది. అసలు.. చంద్రబాబు వల్లనే వ్యాక్సినేషన్ కోసం హాస్పిటల్స్ వద్ద జనాలు బారులు తీరారని వైసీపీ నేతలు చెప్పడం.. ఖచ్చితంగా చంద్రబాబుకే ప్లస్.

YSRCP : వ్యాక్సినేషన్ గురించే ఎక్కువగా విమర్శలు చేస్తున్న చంద్రబాబు?

చంద్రబాబు నాయుడు కరోనా వ్యాక్సిన్ నే పట్టుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ గురించే ఆయన ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి.. కరోనా వ్యాక్సినేషన్ అనేది కేంద్రానికి సంబంధించింది. దాంతో రాష్ట్రానికి సంబంధం లేదు. అయినా సరే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ఇరుకున పెట్టడం కోసం చంద్రబాబు పదే పదే వ్యాక్సినేషన్ గురించి విమర్శిస్తున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో వైసీపీ ఘోరంగా విఫలం అయిందని చంద్రబాబు విమర్శించినప్పుడు వైసీపీ నేతలు పట్టించుకోకుండా ఉన్నా బాగుండేది కానీ.. వాళ్లు చంద్రబాబు విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రయత్నించడమే పెద్ద తప్పిదం అయిపోయింది. అదే చంద్రబాబుకు అనుకూలంగా మారింది.

ysrcp increasing chandrababu naidu mileage

ysrcp increasing chandrababu naidu mileage

చంద్రబాబు మాటలు వినే ప్రస్తుతం జనాలు.. వ్యాక్సినేషన్ కోసం క్యూ కడుతున్నారు. ఓవైపు సీఎం జగన్, ఏపీ మంత్రులు.. వ్యాక్సినేషన్ తమ పరిధిలో లేదని చెప్పినా కూడా జనం అవేమీ పట్టించుకోకుండా… వ్యాక్సిన్ కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. కావాలనే.. వ్యాక్సినేషన్ అనే అస్త్రాన్ని వాడుకొని చంద్రబాబు.. ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతున్నా… ఆయన ట్రాప్ లో వైసీపీ నేతలు పడిపోయారు.. అనేది అక్షర సత్యం.

ఇది కూడా చ‌ద‌వండి == >  YS Jagan : సీఎం క‌న్నా ఆ వైసీపీ ఎమ్మెల్యే బెస్ట్.. ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు..!

ఇది కూడా చ‌ద‌వండి == > వ్యాక్సిన్‌ బాబు తెస్తే మనం ఏం చేస్తాం జగనన్నా..?

ఇది కూడా చ‌ద‌వండి == > దారుణం.. పురిటినొప్పులతో గర్భిణీ బాధపడుతుంటే.. అంబులెన్స్ ను ఆపేసి.. గర్భిణీని నడిపించారు

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది