Ys Jagan : వైసీపీ జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్.! ప్లీనరీలో సెన్సేషనల్ స్పీచ్.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : వైసీపీ జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్.! ప్లీనరీలో సెన్సేషనల్ స్పీచ్.!

Ys Jagan : ప్రాంతీయ పార్టీలకు సంబంధించి పార్టీ వ్యవస్థాపకుడే శాశ్వత అధ్యక్షుడిగా.. అంటే, జీవితకాల అధ్యక్షుడిగా వుంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కాకపోతే, రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం.. అంటూ ఏవేవో కథలు చెప్పి, రెండేళ్ళకో, మూడేళ్ళకో మహానాడు అనీ, ప్లీనరీ అనీ, వ్యవస్థాపక దినోత్సవాలనీ చెప్పి, అధ్యక్షుల ఎంపికను తూతూ మంత్రం ప్రక్రియగా కానిచ్చేస్తుంటారు. అలాంటి నామమాత్రపు ఎన్నికల వ్యవహారం లేకుండా, వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక, వైసీపీ ప్లీనరీ సందర్భంగా జరిగింది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 July 2022,7:00 am

Ys Jagan : ప్రాంతీయ పార్టీలకు సంబంధించి పార్టీ వ్యవస్థాపకుడే శాశ్వత అధ్యక్షుడిగా.. అంటే, జీవితకాల అధ్యక్షుడిగా వుంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కాకపోతే, రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం.. అంటూ ఏవేవో కథలు చెప్పి, రెండేళ్ళకో, మూడేళ్ళకో మహానాడు అనీ, ప్లీనరీ అనీ, వ్యవస్థాపక దినోత్సవాలనీ చెప్పి, అధ్యక్షుల ఎంపికను తూతూ మంత్రం ప్రక్రియగా కానిచ్చేస్తుంటారు.
అలాంటి నామమాత్రపు ఎన్నికల వ్యవహారం లేకుండా, వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక, వైసీపీ ప్లీనరీ సందర్భంగా జరిగింది. రెండ్రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ప్లీనరీ నేటితో ముగిసింది.

ముగింపు ప్రసంగం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ తనదైన స్టయిల్లో. చిప్ చేతిలోనో, ఇంకో చోటనో వుంటే సరిపోదంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్ వేయడం, ప్లీనరీ మొత్తానికే హైలైట్. చంద్రబాబు ఇటీవల తన చేతికి స్మార్ట్ రింగ్ పెట్టుకుని, దాని గురించి బాహాటంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. తనను తాను హైటెక్ అని అందరూ అనుకోవాలన్నది చంద్రబాబు ఉవాచ. దానికి వైఎస్ జగన్ ఇలా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన నాయకుడికి వుండాలనీ, ప్రజల కష్టాల్ని చూసి చలించిపోయి..

YSRCP Life Time President Ys Jagan

YSRCP Life Time President Ys Jagan

ఆ ప్రజలకు మేలు చేయాలన్న కోణంలోనే సరికొత్త రీతిలో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నట్లు వైఎస్ జగన్ చెప్పారు. దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాయనీ, అంతకు ముందు వైసీపీ నుంచి ఎంతమందిని అయితే చంద్రబాబు లాక్కున్నారు, ఆ సంఖ్యే టీడీపీకి ఆ తర్వాత మిగిలిందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. బోరున వర్షం కురుస్తున్నా, వైసీపీ కార్యకర్తలు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగాన్ని ఆద్యంతం శ్రద్ధగా వున్నారు. ఈలలు, గోలలతో ప్రాంగణంలో మరింత ఉత్సాహం నింపారు. ప్రజలకు మేలు చేయడమే వైసీపీ ఎజెండా.. అంటూ వైసీపీ నేతలంతా ప్లీనరీ సాక్షిగా ముక్తకంఠంతో నినదించారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది